K Viswanath : శివలీల.. శంకరాభరణం రిలీజ్ డేట్ రోజే.. కళా తపస్వి కన్నుమూత..
ఆయన ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నా శంకరాభరణం సినిమా మాత్రం నేటికీ ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలా మిగిలింది తెలుగు వారికి. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా రిలీజయి తమిళ్, తెలుగులో భారీ విజయం సాధించి మిగిలిన భాషల్లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలాంటి సినిమా.................

K Viswanath : ఆయన సినిమాలు తెలుగు పరిశ్రమపై ఉన్న ధోరణిని మార్చేశాయి. ఆయన సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో సంగీతాన్ని నిద్రలేపాయి. అయన సినిమాలు ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించాయి. ఆయన సినిమాలు ఎన్నో కోట్ల మంది హృదయాల్ని తాకాయి. ఆత్మగౌరవంతో బతకాలంటూ.. శంకరాభరణం సినిమాతో తన కళాతృష్ణని అందరికి పరిచయం చేసి సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం…. ఇలా ఎన్నో మంచి మంచి ఆణిముత్యాల్లాంటి సినిమాలు తెలుగు వారి తరతరాలకు అందించిన మహనీయులు, దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గురువారం రాత్రి ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూశారు.
ఆయన ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నా శంకరాభరణం సినిమా మాత్రం నేటికీ ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలా మిగిలింది తెలుగు వారికి. 1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా రిలీజయి తమిళ్, తెలుగులో భారీ విజయం సాధించి మిగిలిన భాషల్లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు అని సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన దగ్గర్నుంచి సినిమా అంటే ఇది అనే ప్రయాణం సాగించింది శంకరాభరణం. ఆ సినిమా రిలీజయి 43 ఏళ్ళు అయింది. డైరెక్టర్ గా కె.విశ్వనాథ్ కి మరింత పేరు తెచ్చిన శంకరాభరణం సినిమా రిలీజ్ చేసిన ఫిబ్రవరి 2నే ఆయన మరణించడం ఆశ్చర్యం.
శంకరాభరణం సినిమా మొత్తం రాజమండ్రి పరిసరాల్లోనే తీశారు. ఈ సినిమా 200 రోజులకి పైగా ఎన్నో సెంటర్స్ లో ఆడింది. ఇక నేషనల్ అవార్డులు కాక ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. మాస్కో, ఫ్రాన్స్.. ఇలా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. 4 నేషనల్ అవార్డులు, 7 నంది అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. ఫోర్బ్స్ బెస్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇండియన్ సినిమాల్లో టాప్ 25లో సోమయాజులు నిలిచారు. ఇలా అనేక రకాల అవార్డులు, రివార్డులు ఎన్నో గెలుచుకుంది శంకరాభరణం సినిమా.
K Viswanath Passes Away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
శంకరా.. నాదశరీరా పరా.. అంటూ శివుడ్ని గొంతెత్తి శంకరాభరణంలో పాడిస్తాడు కె.విశ్వనాథ్. పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో భక్తిభావాలు కలిసాగిన వ్యక్తి కె.విశ్వనాథ్. పూజ చేయనిదే ఆయన రోజు మొదలవదు. శివుడికి పరమభక్తుడు. అందుకేనేమో ఆయన తెలుగు సినీ పరిశ్రమకి క్లాసిక్ ఇచ్చిన శంకరాభరణం రిలీజ్ రోజే ఆయన్ని ఆ శివుడు తీసుకెళ్లిపోయాడు. అంతా శివలీల..