K Viswanath : కళాతపస్వికి కళాకారులు నివాళులు.. నేడు షూటింగ్స్ బంద్..

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా సినీ ప్రముఖులు చాలామంది స్వర్గస్తులు అవుతూ వస్తున్నారు. తాజాగా కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనని కడసారి చూసేందుకు సినీ ప్రపంచమంతా కదిలి వస్తుంది. దీంతో నేడు తెలుగు చిత్రసీమ బంద్ ప్రకటించింది.

K Viswanath : కళాతపస్వికి కళాకారులు నివాళులు.. నేడు షూటింగ్స్ బంద్..

k viswanath

K Viswanath : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంత కాలంగా సినీ ప్రముఖులు చాలామంది స్వర్గస్తులు అవుతూ వస్తున్నారు. తాజాగా కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన మొదటి వ్యక్తి కె.విశ్వనాథ్. శంకరాభరణం సినిమాకి నేషనల్ అవార్డ్స్ తో పాటు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందుకున్నారు విశ్వనాథ్. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ చికిత్స పొందుతూ వస్తున్నారు. రెండు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన విశ్వనాథ్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చికత్స పొందుతూ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు.

K Viswanath – Chiranjeevi : మెగాస్టార్‌తో కళాతపస్వి బంధం.. ప్రతి సినిమాకి అవార్డు!

ఆయన మరణం వార్తతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశ్వనాథ్ మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనని కడసారి చూసేందుకు సినీ ప్రపంచమంతా కదిలి వస్తుంది. దీంతో నేడు తెలుగు చిత్రసీమ బంద్ ప్రకటించింది. కళాతపస్విని కడసారి చూసుకునేందుకు కళాకారులు అందరికి అవకాశం కలిపిస్తూ నేడు షూటింగ్ లు అన్ని నిలిపి వేశారు. ప్రస్తుతం విశ్వనాథ్ భౌతికకాయం ఆయన ఇంటి వద్దనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఇంటి వద్దకు చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.

K Viswanath : ఒక్కొక్కరిగా.. దివికేగిన సినిమా త్రయం.. బాలసుబ్రమణ్యం, సిరివెన్నెల, కె.విశ్వనాథ్..

కాగా విశ్వనాథ్ చిత్రాల్లో భారతీయ కళలకి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేసేవారు. సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన విశ్వనాథ్ ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన విశ్వనాథ్ ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా ఆయన ఎన్నో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డులు గెలుచుకున్నారు. దర్శకుడు గానే కాదు నటుడిగా కూడా అనేక సినిమాల్లో నటించారు. తన నటనకి కూడా అనేక అవార్డులు అందుకున్నారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా శుభసంకల్పం సినిమాకి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా కలిసుందాంరా సినిమాకు నంది అవార్డులు గెలుచుకున్నారు.