K Viswanath : ఆ సినిమా తీయాలనేది కె.విశ్వనాథ్ కల..
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన దర్శకత్వంలో భారతీయ సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలు అందించారు. విశ్వనాథ్ తన కెరీర్ లో ఎక్కువగా సాంఘిక సినిమాలే చేశారు. అయితే విశ్వనాథ్ కి...

K Viswanath : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ రెండు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు అంతా కళాతపస్వి మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
K Viswanath Passed Away : కె.విశ్వనాథ్ షూటింగ్ సెట్‌లో ఖాకీ డ్రెస్‌లో ఉండడానికి గల కారణం తెలుసా?
భారతీయ సంస్కృతి, గ్రామీణ కళల, సాహిత్యం మరియు సంగీతంతో కథలను ఎంచుకొని వాటిని వెండితెర పై విశ్వనాథ్ తెరకెక్కించే తీరు అద్భుతం. ఆయన దర్శకత్వంలో భారతీయ సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలు అందించారు. రాజమౌళి కంటే ముందే తెలుగు పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు విశ్వనాథ్. సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన విశ్వనాథ్ ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పని చేసిన విశ్వనాథ్ 50 సినిమాలకు దర్శకత్వం వహించారు.
K Viswanath : కళాతపస్వి వచ్చి అభిమానితో మాట్లాడితే.. వైరల్ అవుతున్న ఓ అభిమాని ఆవేదన..
కాగా విశ్వనాథ్ తన కెరీర్ లో ఎక్కువగా సాంఘిక సినిమాలే చేశారు. ఆదిశంకరుడు, రామదాసు, గౌతమ బుద్ధుడు వంటి ఆధ్యాత్మిక సినిమాలు చేసే అవకాశం వచ్చినా, ఆ జోనర్ పై అవగాహన లేదని ఆ ఆఫర్ లని కాదన్నారు. అయితే విశ్వనాథ్ కి అన్నమయ్య సినిమా చేయాలనే ఆలోచన ఉండేది అంటా. అన్నమయ్య వాగ్గేయకారుడు కావడంతో విశ్వనాథ్ కి ఆ మూవీ తీయాలనే కోరిక ఉండేదట. దీంతో ఆ సినిమా తీయడం కోసం చాలా ఏళ్ల పాటు అన్నమయ్య కథపై పరిశోధన చేశారు. అయితే అప్పటికే ఆ కథతో కె రాఘవేంద్రరావు సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకున్న విశ్వనాథ్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. సంగీతాన్ని కూడా ఒక ఎమోషన్ గా చూపించే విశ్వనాథ్.. వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య కథని ఇంకెంత అందంగా చూపించి ఉండేవారో.