కేఏ పాల్ కోడలి కంప్లైంట్: రివర్స్ గేర్ వేసిన వర్మ

కేఏ పాల్ కోడలి కంప్లైంట్: రివర్స్ గేర్ వేసిన వర్మ

తాజాగా విడుదల చేసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోడలు జ్యోతి వర్మపై కంప్లైంట్ చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తమ ఫోటోలను మార్ఫింగ్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. చిత్రంలో పాల్ కోడలు జ్యోతి కూడా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. కేఏ పాల్ చేతుల మీదుగా సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంటున్నట్లు ఉన్న మార్ఫింగ్ ఫోటోను వర్మ పోస్టు చేశాడు. 

జ్యోతి ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. వర్మకు నోటీసులు పంపారు. మంగళవారం ఉదయం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. కేఏ పాల్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు వర్మ కౌంటర్ ఇచ్చాడు. ఆ ఫోటోను మార్ఫింగ్ చేయలేదని.. ఎక్కడో చూసి పోస్ట్ చేసినట్లు తెలిపారు. మనిషిని మార్ఫింగ్ చేస్తే కేఏ పాల్ అవుతారని తాను అనుకుంటున్నట్లు వర్మ తెలిపారు.

రివర్స్ గేర్ వేసిన వర్మ 
వర్మ కూడా పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. సినిమాను కొందరు కావాలనే అడ్డుకున్నారని.. అందుకే సినిమా ఆలస్యంగా విడుదలైందన్నారు. సినిమా ఆలస్యమవడంతో చిత్ర యూనిట్‌కు భారీ నష్టం వాటిల్లిందన్నారు. కారకులైన వారిపై పరువునష్టం దావా వేయనున్నట్లు వర్మ తెలిపారు. మొత్తానికి పాల్ వర్సెస్ రాంగోపాల్ వర్మగా ఉన్న వివాదం ఇప్పుడు పోలీసులు, కోర్టుల చుట్టు తిరిగేలా కనిపిస్తోంది.