సన్నీ ఫోన్ నెంబర్ అడగలేదు…క్షమాపణ చెప్పాలన్న బాలీవుడ్ నటుడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2020 / 10:50 AM IST
సన్నీ ఫోన్ నెంబర్ అడగలేదు…క్షమాపణ చెప్పాలన్న బాలీవుడ్ నటుడు

సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో సన్నీ ఒకరు. 2012లో జిస్మ్2 థ్రిల్లర్ మూవీతో బాలీవుడ్ లోకి సన్నీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలో కూడా సన్నీ నటించింది. మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ,యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో సన్నీ నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు తన టిక్‌టాక్ వీడియోలకు చాలా ఫేమస్.

అయితే ఎప్పటికప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోయే ఈ బోల్డ్ బ్యూటీని ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ పలకరించి, ఫోన్ నెంబర్ అడిగారని. దీనికి సన్నీ స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అంటూ వచ్చిన కొన్ని వార్తలపై స్వయంగా కబీర్ బేడీ స్పందించారు. తాను సన్నీ ఫోన్ నెంబర్ అడినట్లు,దానికి సన్నీ తన నెంబర్ కి బదులుగా తన భర్త డేనియల్ నెంబర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని,తన పరువుకి భంగం కలిగించేలా కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారంటూ కబీర్ బేడీ మండిపడ్డారు. తనపై వస్తున్న ఇలాంటి వార్తలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

డాబూ రత్నాని పార్టీలో, తాను సన్నీ భర్త డేనియల్ వెబర్‌ను అతని నంబర్ కోసం అడిగాను. అతను  నా ఫోన్‌లో ఆయన ఫోన్ నెంబర్ సేవ్ చేశాడు. తాను సన్నీని ఫోన్ నెంబర్ అడిగితే,ఆమె తన భర్త ఫోన్ నెంబర్ ఇచ్చిందనే భయంకరమైన రిపోర్ట్ ను ప్రచురించిన పబ్లికేషన్స్ వెంటనే దానిని తీసివేసి క్షమాపణ చెప్పాలని కబిర్ బేడీ అన్నారు.

అయితే ఈ వార్తలపై సన్నీ భర్త డేనియల్ కూడా ట్వీట్ చేశాడు. చాలా సంవత్సరాలుగా సన్నీ,కబీర్ బేడి ఒకరికొకరు తెలుసు. అతడి దగ్గర సన్నీనెంబర్ ఉంది. ఏదో బక స్టోరీ కోసం ఇలాంటి చెత్తవాటిని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు సన్నీ భర్త డేనియల్

అసలేం జరిగింది
డబూ రత్నానీ క్యాలెండర్ కోసం ఇటీవల హీరోయిన్ల సెమీ న్యూడ్ ఫోటోలు షూట్ చేశారు. ఇందుకోసం పాపులర్ అండ్ హాట్ బ్యూటీలను ఎంపిక చేసుకొని వారితో ఆ ఫోటో షూట్ చేశారురు. ఇందులో భాగంగా సన్నీలియోన్, కియారా అద్వానీ లాంటి బోల్డ్ బ్యూటీస్ హాట్ ఫోటోలను తీశారు. 

సెమీ న్యూడ్ ఫొటో షూట్ జరుగుతున్న సమయంలో సన్నీలియోనీతో పాటు ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట. ఫొటో షూట్ పూర్తికాగానే ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారట. ఈ క్రమంలో సన్నీ ఫోన్ నెంబర్ అడిగారట కబీర్ బేడీ. దీంతో వెంటనే రియాక్ట్ అయిన సన్నీ అతనికి షాకిస్తూ తెలివిగా తప్పించుకునేందుకు తన భర్త డేనియల్ నెంబర్ ఇచ్చిందట. సినీ ఇండస్ట్రీలో కబీర్ బేడీ ఓ సీనియర్ నటుడు కాబట్టి.. నెంబర్ ఇవ్వనంటే ఫీల్ అవుతాడేమో అని భావించి, తన నెంబర్‌కి బదులుగా తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చేసిందట సన్నీ. ఈ విషయం తెలుసుకున్న కబీర్ షాక్ అయినట్లుగా పలు బాలీవుడ్ మీడియా వర్గాలు తెలిపాయి

దాపుగా న్యూడ్ పిక్ అన్నట్లుగానే అనిపిస్తున్న ఈ ఫొటోల్లో సదరు హీరోయిన్స్ తమ ప్రయివేట్ పార్ట్స్ మాత్రం కనిపించకుండా చిన్న అడ్డు పెట్టుకున్నారు. కియారా ఆకు చాటున అందాలు దాచిపెట్టగా, సన్నీలియోన్.. ఓ పుస్తకాన్ని తన అందాలకు అడ్డు పెట్టేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.