వకీల్ సాబ్ నుంచి మరో సాంగ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

వకీల్ సాబ్ నుంచి మరో సాంగ్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

Kadhulu

పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చెయ్యబోతుంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా ‘కదులు కదులు కట్లు తెంచుకుని కదులు’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ వింటుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి అంటూ అభిమానులు అంటున్నారు.

సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని శ్రీ కృష్ణ, హేమచంద్ర ఆలపించారు. తమన్‌ స్వరాలు అందించారు. ‘దెబ్బ కొడితే పులి నేను ఆడదాన్నంటుందా.. తోక తొక్కితే నాగు తనను ఆడదనుకుంటుందా’ అంటూ సాగే ఈ గీతం మహిళల్లో స్ఫూర్తి నింపే విధంగా ఉంది.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో, బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’, ‘కంటిపాప’ అనే మూడు పాటలు విడుదల కాగా.. లేటెస్ట్‌గా విడుదలైన పాట కూడా ఆకట్టుకుంటుంది. ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.