విశాల హృదయం: ఆదివాసీలకు స్కూల్ కట్టిస్తున్న కాజల్

విశాల హృదయం: ఆదివాసీలకు స్కూల్ కట్టిస్తున్న కాజల్

వయస్సు పెరిగిపోతున్నా వన్నె తగ్గని భామ కాజల్. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన క్వీన్ మూవీకి రీమక్‌గా రూపొందొస్తున్న పారిస్ పారిస్ చిత్రంలో బిజీగా ఉన్న కాజల్.. సడెన్‌గా సమాజ సేవలో దిగిపోయింది. అరకు లోయ ప్రాంతంలో ఉన్న పిల్లలకు స్కూల్ కట్టిస్తానని మాటిచ్చింది.  
Read Also : కోహ్లీని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

తమిళ్ న్యూస్ డైలీ అనే మీడియాతో మాట్లాడిన కాజల్.. తన పెళ్లి గురించి, చారిటీ పనుల గురించి ఏం చేయాలనుకుంటుందో వెల్లడించింది. ‘నన్నెవరు కలిసినా నా పెళ్లి గురించే అడుగుతున్నారు. కానీ, సినిమాలపైనే దృష్టి పెట్టా. నాకు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరికీ ముందే చెప్తా. ప్రస్తుతం పారిస్ పారిస్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందానని ఎదురుచూస్తున్నా’

‘ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆదివాసీ పిల్లలు స్కూల్ లేక ఇబ్బందులు పడడం చూశా. అది చూసి నా మనసు చలించిపోయింది. వారి స్కూల్ నిర్మాణానికి కావాలసినంత డబ్బును విరాళంగా ఇచ్చాను’ అని చెప్పుకొచ్చింది కాజల్. ఈవిడ చేతిలో పారిస్ పారిస్, కోమలి, సీత ఇలా పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. 
Read Also : ఇక కంట్రోల్ మీ చేతుల్లో : ఫేస్‌బుక్.. News Feed మార్చేస్తోంది