అవును.. మూడు రోజులుగా మందు ఎక్కువేస్తున్నా..

ఆల్కాహాల్ గురించి కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : March 12, 2020 / 10:45 AM IST
అవును.. మూడు రోజులుగా మందు ఎక్కువేస్తున్నా..

Kajal Aggarwal (Image : Instagram)

ఆల్కాహాల్ గురించి కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది..

కలువకళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ గత మూడు రోజుల నుండి మోతాదుకి మించి మందేస్తుందంట.. గత మూడు రోజులుగా ఆల్కహాల్‌ విపరీతంగా తీసుకుంటున్నా’ అంటూ.. కాజల్ తాజాగా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజల్ అంత ఓపెన్‌గా డ్రింక్ చేస్తుందని చెప్తోందా.. ఏంటబ్బా విచిత్రం.. అనుకుంటున్నారా.. అక్కడితో ఆగిపోండే..  కాజల్ ఆల్కాహాల్ గురించి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అన్నమాట. కరోనా వైరస్‌ కారణంగా ఇటీవల అందరూ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండే హ్యాండ్ శానిటైజర్స్ వాడుతున్న సంగతి తెలిసిందే.(విజయ్‌ని వదలట్లేదుగా.. మళ్లీ రంగంలోకి దిగిన ఐటీ..)

ఇల్లు, ఆఫీస్, స్కూల్స్, కాలేజీలు.. ఇలా అన్నిచోట్లా బయటకి వెళ్లేప్పుడు, లోనికి వచ్చేప్పుడు అదేపనిగా చేతులకు శానిటైజర్స్ పూస్తూ ఉన్నారు. దాని గురించే కాజల్ కాస్త కామెడీ కోటింగ్ ఇచ్చి ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘ఇప్పటివరకు నేను తీసుకున్న ఆల్కహాల్ కంటే గత మూడు రోజులుగా నా చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడిన ఆల్కహాలే ఎక్కువ’.. అంటూ కాజల్ ట్వీట్ చేసింది.

అలాగే కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీని గురించి కూడా కాజల్ మరో సెటైరికల్ ట్వీట్ (హిందీ) చేసింది. ‘ఇప్పుడేం ఏం చేస్తే మంచిదని స్టాక్ బ్రోకర్‌ని అడిగితే’.. ‘భగవంతుణ్ణి స్మరించండని చెప్పాడు’.. అంటూ కాజల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.