పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన కాజల్..

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 12:48 PM IST
పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన కాజల్..

Kajal Aggarwal announces her wedding: తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ పెళ్లిపీటలు ఎక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాజల్ త్వరలోనే ముంబైకి చెందిన ఎంటర్‌ప్రెన్యూర్‌ గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి.




ఈ వార్తలపై హీరోయిన్‌ కాజల్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా తన పెళ్లిని ఆమె ఖరారు చేశారు కాజల్ అగర్వాల్. అక్టోబర్‌ 30న గౌతమ్‌కిచ్లుతో తన వివాహం జరుగనున్నట్లు ఆమె తెలిపారు.

‘‘అక్టోబర్‌ 30న ముంబైలో గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకుంటున్నానని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. చిన్నగా జరిగే ఈ వేడుకలో సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. పాండమిక్‌ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను. ఇన్నేళ్లు మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను..’’ అని తెలియజేసింది కాజల్‌.