NBK108: బాలయ్య సినిమాలో జాయిన్ అయిన కాజల్..!
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఆయన తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టారు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన కెరీర్‌లోని 108వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించింది చిత్ర యూనిట్.

Kajal Aggarwal Joins NBK108 Movie
NBK108: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఆయన తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టారు. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య తన కెరీర్‌లోని 108వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించింది చిత్ర యూనిట్.
అయితే ఈ సినిమాలో బాలయ్య సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో తెలంగాణ యాసతో బాలయ్య తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే వెల్లడించాడు. కాగా, ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటిస్తోంది. ఇటీవల ఆమె ఈ సినిమాలో జాయిన్ అయినట్లుగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే విషయంపై చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది.
NBK108: అనిల్ రావిపూడి మూవీ కోసమే బాలయ్య గడ్డం పెంచుతున్నాడా..?
ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈమేరకు ఆమె ఈ సినిమాలో భాగం అవుతున్నట్లుగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.