ఫోటోలు: పెళ్లి పీటలెక్కిన కాజల్ అగర్వాల్.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..

  • Published By: vamsi ,Published On : October 30, 2020 / 11:01 AM IST
ఫోటోలు: పెళ్లి పీటలెక్కిన కాజల్ అగర్వాల్.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..

కుర్రకారు గుండెల్లో కలల రాణి, వెండితెర చందమామ కుమారి కాజల్.. శ్రీమతి కాజల్‌‌గా మారిపోతుంది. ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకుని కాజల్‌ సెటిల్ అయిపోతుంది. ఇవాళ(30 అక్టోబర్ 2020) కాజల్ పెళ్లి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో ముంబైలో జరుగుతుంది. గౌతమ్‌ కిచ్లుతో తన వివాహం కుదిరినట్లు అక్టోబర్‌ 6న ప్రకటించిన కాజల్.. ఆ తర్వాత పెళ్లి పనులతో బిజీ అయ్యారు.


ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమ గుండె గూటిలో ఆమె గుడి కట్టుకున్న అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.





ఈ క్రమంలోనే పెళ్లి వేడుక, హల్దీ సెరమనీకి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

పెళ్లికి ముందు నిర్వహించిన హల్దీ వేడుకలో పసుపు పచ్చ సల్వార్ కమీజ్ దుస్తులతో కనిపించిన కాజల్.. చాలా అందంగా ఉంది. కళ్లకు గాగూల్స్ పెట్టుకొని ప్రియుడితో కలిసి స్టెప్పులు వేయగా.. కొద్ది మందికి మాత్రమే వేడకకు ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది.

హల్దీ వేడుకలో అందంగా కనిపించిన చందమామ కాజల్‌ను పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఆమె తల్లి కళ్యాణ తిలకం దిద్దారు.


ఈ ఫోటోల్లో కాజల్‌ ఎమోషన్స్ కనిపించాయి. ఈ వేడుక కోసం పూలుతో చేసిన మాలలతో అలంకరించగా.., ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలను కాజల్‌కు పెట్టి అలంకరించారు.


హల్దీ వేడుకలో కాబోయే భర్త గౌతమ్ కిచ్లూ కూడా పాల్గొనగా.. గౌతమ్‌తో కలిసి డ్యాన్సులు చేసింది కాజల్.


ఈ పార్టీలో తన సోదరి, టాలీవుడ్ హీరోయిన్ నిషా అగర్వాల్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి ఉత్సాహంగా పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.