Kajal Aggarwal : ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు

తాజాగా కాజల్ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కాజల్ సీమంతం వేడుకలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో............

Kajal Aggarwal :  ఘనంగా కాజల్ సీమంతం వేడుకలు

Kajaalll

Kajal Aggarwal :  సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. 2020 అక్టోబర్‌30న తాను ప్రేమించిన ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క తన భర్త బిజినెస్ లు కూడా చూసుకుంటుంది. ఇటీవలే న్యూ ఇయర్‌ సందర్భంగా కాజల్‌ ప్రెగ్నెన్సీని తన భర్త అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.

ఇక అప్పట్నుంచి కాజల్ ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ గురించి, తాను చేస్తున్న ఎక్సర్ సైజులు, అప్పుడప్పుడు తన బేబీ బంప్ ఫొటోలు.. ఇలా అన్నీ షేర్ చేస్తుంది. కాజల్ తన బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంది. తల్లి కాబోతున్న ఆనందాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంది.

Kajal Agarwal : కాజల్ సీమంతం వేడుకలు

తాజాగా కాజల్ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కాజల్ సీమంతం వేడుకలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కాజల్ సీమంతం వేడుకల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్నాయి.