BiggBoss 5 : ఒకరి మొహంపై ఒకరు నీళ్లు.. జైలుకి వెళ్లిన కాజల్

తాజాగా బిగ్‌బాస్‌ ఈ వారం వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎన్నుకుని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆదేశించాడు. అందులో భాగంగా ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లు వారికి వరస్ట్ పర్ఫామర్ అనుకున్న

BiggBoss 5 : ఒకరి మొహంపై ఒకరు నీళ్లు.. జైలుకి వెళ్లిన కాజల్

Bb

BiggBoss 5 :  బిగ్ బాస్ లో రోజు రోజుకి గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. ప్రతి టాస్క్ లోను గొడవ పడుతున్నారు కంటెస్టెంట్స్. తాజాగా బిగ్‌బాస్‌ ఈ వారం వరస్ట్‌ పర్ఫామర్‌ను ఎన్నుకుని జైలుకు పంపించాల్సి ఉంటుందని ఆదేశించాడు. అందులో భాగంగా ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లు వారికి వరస్ట్ పర్ఫామర్ అనుకున్న వ్యక్తులను బలిపీఠం ఎక్కించి, ఎందుకు అనుకుంటున్నారో కారణాలు చెప్పి వారి ముఖం మీద నీళ్లు పోయమని చెప్పాడు.

మొదటగా వచ్చిన శ్వేత తనకు సన్నీ, యానీకి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉందని, దాన్ని ఇన్‌ఫ్లూయెన్స్‌తో చెడగొట్టవద్దని కాజల్‌కు చెప్పి కాజల్ ముఖంపై నీళ్లు కొట్టింది. హమీదా కూడా మన మధ్య ఏ రిలేషన్‌ ఉండొద్దంటూ కాజల్‌ ముఖం మీద నీళ్లు పోసింది. శ్రీరామ్‌ కూడా కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా చెప్పడంతో కాజల్ బాధపడింది. అనంతరం లోబో టాస్క్‌లో రవిని వెన్నుపోటు పొడిచావంటూ కాజల్‌ మీద నీళ్లు పోశాడు. ఇక రవి.. నేను కిచెన్‌లో పని చేయలేదని స్టేట్‌మెంట్‌ ఇవ్వడం తప్పు అంటూ కాజల్‌ను తిట్టి వరస్ట్ పర్ఫార్మర్ గా చెప్పాడు. విశ్వ కూడా కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్న యానీ మాస్టర్‌ ఆమె మీద కోపంతో తన ముఖం మీద తానే నీళ్లు గుమ్మరించుకొని షాక్ ఇచ్చింది.

Siddarth : చిన్న గాయమే సర్జరీ కాదు.. ‘మా ఎలక్షన్స్ లో ఓట్ వేయడానికే లండన్ నుంచి వచ్చాను..

ఇక జెస్సీ.. నా ఫుడ్‌ నన్ను వండుకోమని ఆర్డర్‌ చేయడం నచ్చలేదంటూ శ్రీరామ్‌ను వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. దీంతో శ్రీరామ్‌, జెస్సీకి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇక శ్రీరామ్ కాజల్ ని వరస్ట్ పర్ఫార్మర్ అనడంతో ఇక నుంచి మన మధ్య బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌ కూడా వద్దని చెప్పి కాజల్ శ్రీరామ్‌ని వరస్ట్‌ పర్ఫామర్‌గా సెలెక్ట్ చేసింది. నువ్వు నన్ను చీడపురుగులా చూస్తావు, అనుమానిస్తావు, ఇకనుంచి నిన్ను బ్రదర్‌ అని పిలవను అని చెప్పి అతడి ముఖం మీద నీళ్లు కొట్టింది. శ్రీరామ్‌ కెప్టెన్ గా సరిగా పని చేయట్లేదంటూ మానస్‌, సన్నీ అతడిని వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు.

ఇక టాస్క్‌లో అనవసరంగా నోరు జారాడు అంటూ విశ్వను వరస్ట్‌ పర్ఫామర్‌గా సెలక్ట్ చేశారు షణ్ముఖ్‌, సిరి, ప్రియ. ప్రియాంక సింగ్‌ కూడా విశ్వ నోరు జారాడంటూ వరస్ట్‌ పర్ఫామర్‌గా ఎన్నుకుంది.

MAA Election: ‘మా’ ఎన్నికలలో ఎమ్మెల్యే రోజా ఓటెవరికి?

ఇక మొత్తంగా హౌస్‌లో ఎక్కువమంది కాజల్ ని వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకోవడంతో కాజల్ బాధపడి తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. ఎక్కువమంది వరస్ట్ పర్ఫార్మర్ గా కాజల్ ని సెలెక్ట్ చేయడం తో బిగ్‌బాస్‌​ కాజల్ ని జైల్లో వేయమని చెప్పగానే ఏడ్చేసింది.