Kajol: ఇంత అహంకారమా.. కాజోల్‌పై నెటిజన్ల మండిపాటు!

వెండితెర మీద వేరు.. రియల్ లైఫ్ లో వేరు. రెండుచోట్లా ఒకేలా బ్రతికే నటీనటులు చాలా తక్కువ ఉంటారు. అయితే.. ఆ విషయం తెలియని అభిమానులు పిచ్చి ప్రేమతో తమ అభిమాన నటీనటులను ఏదోలా ఊహించుకుంటారు. తీరా వాళ్ళు ఊహించుకున్నట్లు ఆ సెలబ్రిటీలు లేకపోతే హార్ట్ అవుతుంటారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ విషయంలో ఇదే జరిగింది.

Kajol: ఇంత అహంకారమా.. కాజోల్‌పై నెటిజన్ల మండిపాటు!

Kajol

Kajol: వెండితెర మీద వేరు.. రియల్ లైఫ్ లో వేరు. రెండుచోట్లా ఒకేలా బ్రతికే నటీనటులు చాలా తక్కువ ఉంటారు. అయితే.. ఆ విషయం తెలియని అభిమానులు పిచ్చి ప్రేమతో తమ అభిమాన నటీనటులను ఏదోలా ఊహించుకుంటారు. తీరా వాళ్ళు ఊహించుకున్నట్లు ఆ సెలబ్రిటీలు లేకపోతే హార్ట్ అవుతుంటారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ విషయంలో ఇదే జరిగింది. కాజోల్ ఈ మధ్యనే తన 47వ పుట్టినరోజు జరుపుకుంది. కరోనా కారణంగా సింపుల్‌గా అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ బర్త్ డే పార్టీ జరిగింది.

అయితే.. ఇది తెలియని అభిమానులు కొందరు కాజోల్ నివాసం వద్దకు వెళ్లి ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసేందుకు వెళ్లారు. సెలబ్రిటీల ఇల్లు, సెక్యూరిటీ గురించి అందరికీ తెలిసిందే కదా. కాజోల్ ఇంటికి వెళ్లిన అభిమానులకు ఏదో ఫార్మాలిటీగా దర్శనం ఇచ్చి వెళ్ళిపోయింది. కొందరు అభిమానులు ప్రేమతో కేక్స్ కూడా తీసుకెళ్లి కాజోల్ తో కట్ చేయించాలనుకున్నారు. ఎట్టకేలకు ఓ అభిమాని కేక్ కట్ చేసేందుకు వచ్చిన కాజోల్ హడావుడిగా దాన్ని కట్ చేసి లోపలకి వెళ్ళిపోయింది.

ఈ సందర్భంగా ఆమె కట్ చేసిన కేక్ నుండి ఒక పీస్ తినాలని అభిమానులు కోరినా ఆమె నో అంటూనే లోపలకి వెళ్ళిపోయింది. చివరికి ఆ అభిమానులు ఆమెతో ఫోటో దిగేందుకు మరోసారి సిబ్బందిని బ్రతిమాలుకుంటే అలా బయటకి వచ్చిన కాజోల్ ఫోటో క్లిక్ మానేవరకు ఉండి వెళ్ళిపోయింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కాజల్ ఆటిట్యూడ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

అభిమానులు ప్రేమగా శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తే కనీసం వారిని ప్రేమగా పలకరించలేవా అంటూ మండిపడుతున్నారు. ఇంత అహకారం ఎందుకు కాజోల్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంత హీరోయిన్‌ అయితే మాత్రం అంత పొగరు పనికిరాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)