నాకు రెండు సార్లు అబార్షన్ అయ్యింది: హీరోయిన్ కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తన జీవితంలో జరిగిన బాధాకరమైన విషయాలను ఓ ఇన్స్టాగ్రామ్ పేజీలో చెప్పింది. తాను అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న తరవాత రెండు సార్లు అబార్షన్ జరిగిందని చెప్పింది. పెళ్లైన కొన్నాళ్లకు పిల్లలు కావాలనుకున్నాం, 2001వ సంవత్సరంలో ‘కభీ ఖుషీ కభీ ఘం’ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని.. అంతేకాకుండా ఆ సినిమా చాలా బాగా వచ్చింది అలాంటి సంతోషకరమైన సమయంలో అబార్షన్ అవ్వడంతో ఆసుపత్రిలో చేరానని తెలిపింది.
అయితే ఆ ఒక్కసారే కాదు.. నాకు అలా ఇంక్కోసారి కూడా అబార్షన్ అయ్యిందని.. అలా రెండు సార్లు అబార్షన్ అయిన తర్వాత మాకు నైసా, యుగ్ ఇద్దరు పిల్లలు పుట్టారని కాజోల్ చెప్పారు. గతంలో అజయ్ దేవగన్ తో కలిసి కాజోల్ ఇష్క్, ప్యార్ తో హోనా హీ తా, యూ, మీ ఔర్ హమ్ సినిమాల్లో నటించారు.
అజయ్ తో నాలుగేళ్ల పాటు చేసిన డేటింగ్ తర్వాత పెళ్లి.. అనంతరం సిడ్నీ, హవాయి, లాస్ ఏంజెల్స్లతో హనీమూన్ విశేషాలను కాజోల్ చెప్పారు. అజయ్ దేవగన్ తానాజీ మలుసారే పాత్ర పోషిస్తుండగా కాజోల్ తానాజీ భార్య సావిత్రిబాయి మలుసారే పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కోసం పనిచేస్తున్న రాజ్ పుత్ అధికారి ఉదయ్ భన్ అనే విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు.