Kalyan Ram : రామ్‌చరణ్ అంటే నాకు గుర్తుకు వచ్చేది అదే.. కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మూవీ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే 10tvకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ మూవీలో కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కన్నడ భామ ఆషికా రంగ‌నాథ్‌ ఈ సినిమాతో తెలుగు వారికి పరిచయం అవుతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మూవీ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే 10tvకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

Amigos : శేఖర్ కమ్ముల టైటిల్ వాడేసిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాకి పేరు ఎలా పెట్టారో తెలుసా??

ఈ హీరో పేరు చెప్పగానే మీకు మొదటిగా గుర్తుకు వచ్చే విషయం ఏంటని విలేకరి అడుగగా.. బాలకృష్ణ అంటే బాబాయ్, ఎన్టీఆర్ అంటే తమ్ముడు అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ప్రభాస్ పేరు చెప్పగా.. బాహుబలి అని చెప్పాడు. చివరిగా రామ్ చరణ్ పేరు చెప్పగా.. రంగస్థలం అని బదులిచ్చాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన నాకు చాలా ఇష్టం. చరణ్ పేరు చెబితే నాకు ఆ సినిమానే గుర్తుకు వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అలాగే బాలయ్య అన్‌స్టాపబుల్ కి ఎప్పుడు వెళుతున్నారు అని ప్రశ్నించగా.. ఆహా వాళ్ళు పిలవడమే లేటు. నేను రెడీగా ఉన్నాను అంటూ బదులిచ్చాడు. కాగా అమిగోస్ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా బింబిసార వంటి విజయంతో ఉండడం, పైగా ఈ మూవీలో హీరో, విలన్ తానే అయ్యి నటిస్తుండడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.