Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్ వచ్చేది ఈరోజే..!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలను పెంచే విధంగా ఈ సినిమా టీజర్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్ వచ్చేది ఈరోజే..!

Kalyan Ram Amigos Movie Trailer To Be Out On This Date

Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలను పెంచే విధంగా ఈ సినిమా టీజర్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Amigos: ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ పాటలో ఇరగదీసిన కళ్యాణ్ రామ్..!

ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై బజ్ మరింతగా పెరిగింది. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌పై చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అమిగోస్ చిత్ర ట్రైలర్‌ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుందా.. ఈ ట్రైలర్ కట్‌లో సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను మనకు చూపెడతారా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో అందాల భామ అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. రాజేంద్ర రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.