Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..

తాజాగా బింబిసార ట్రైలర్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకులని ఆకట్టుకొని అంచనాలని పెంచేసింది. ఈ సినిమాలో బింబిసారుడు అనే రాజుగా కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనని కనబరిచినట్టు తెలిసిపోతుంది. ఈ సినిమా కోసం........

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..

Bimbisara Ntr

Bimbisara :  కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. పటాస్ సినిమాతో గాడిలో పడి అక్కడి నుంచి వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. తాజాగా మరో కొత్త కథతో రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. రాజ్యాలు, రాజులతో పాటు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రస్తుత కాలానికి సంబంధించి ఉండేలా అద్భుతమైన కథతో బింబిసార అంటూ రాబోతున్నాడు.

తాజాగా బింబిసార ట్రైలర్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకులని ఆకట్టుకొని అంచనాలని పెంచేసింది. ఈ సినిమాలో బింబిసారుడు అనే రాజుగా కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనని కనబరిచినట్టు తెలిసిపోతుంది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ లుక్ కూడా మార్చాడు. అయితే బింబిసార సినిమా మూడు పార్టులు ఉంటుందని, వచ్చే సంవత్సరం బింబిసార 2 వస్తుందని ముందే చెప్పేసారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Sree Vishnu : ‘అల్లూరి’ సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ రోల్‌లో శ్రీ విష్ణు..

సోమవారం సాయంత్రం బింబిసార ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ”నేను, ఎన్టీఆర్ అన్ని కుదిరితే బింబిసార నెక్స్ట్ పార్ట్స్ లో కచ్చితంగా కలిసి నటిస్తాం” అని అన్నారు. దీంతో బింబిసార 2 లేదా బింబిసార 3 లో కచ్చితంగా కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త విని ఎన్టీఆర్ అభిమానులతో పాటు, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అన్నదమ్ములని తెరపై ఒకే సారి చూడాలని ఎదురుచూస్తున్నారు.