Kalyan Ram : బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?

కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమా ఆగస్టు 5న రిలీజ్ అవ్వనుంది. ప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

Kalyan Ram : బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?

Bimbisara : కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమా ఆగస్టు 5న రిలీజ్ అవ్వనుంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు. క్యాథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్ గా నటించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో భారీగా ఈ సినిమాని తీశారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

కళ్యాణ్ రామ్ బింబిసార ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

నైజాం – రూ.5 కోట్లు

సీడెడ్ రూ.2 కోట్లు

ఆంధ్ర – రూ.6.50 కోట్లు

మొత్తం తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ.13.50 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.1.10 కోట్లు

ఓవర్సీస్ – రూ.1 కోటి రూపాయలు బిజినెస్ చేసింది.

Tollywood : ముగిసిన ప్రొడ్యూసర్ గిల్డ్-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీటింగ్.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ తగ్గుతాయా?

టోటల్ వరల్డ్ వైడ్ రూ.15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బింబిసార సినిమా. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం రూ.16 కోట్లు అయినా కలెక్ట్ చేయాలి. కళ్యాణ్ రామ్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ అంటే బాగానే జరిగినట్లు. నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి వివరాలు ఇంకా బయటకి రాలేదు. మరి కళ్యాణ్ రామ్ సరికొత్తగా తీసుకొస్తున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.