NTR30 : శ్రీరామనవమి కానుకగా NTR30 అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మిస్తున్న NTR30 అప్డేట్ ని శ్రీరామనవమి పండుగా సందర్భంగా తెలియజేశాడు. ఆ అప్డేట్ ఏంటంటే?

NTR30 : శ్రీరామనవమి కానుకగా NTR30 అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

Kalyan Ram gave an update on NTR30 regular shoot

NTR30 : RRR తరువాత ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న చిత్రం NTR30. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైంది. కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఈరోజు (మార్చి 30) శ్రీరామనవమి పండుగా సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.

NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కొరటాల..?

ఈ సినిమా రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోబోతున్నట్లు తెలియజేశాడు. మొదటి షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశం తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం భారీ నౌక సెట్ ని నిర్మించారు. నడి సముద్రంలో జరిగే ఈ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి యాక్షన్ సినిమాకు పని చేసిన కెన్నీ బెట్స్ ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ డిజైన్ చేస్తున్నాడు. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆక్వా మ్యాన్ వంటి సినిమాలకు వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ ఈ చిత్రానికి VFX డిజైనర్ గా పని చేయబోతున్నాడు.

NTR: అతడిని చూస్తేనే పారిపోయే ఎన్టీఆర్.. అంతలా భయపెట్టేది ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి పెరిగిపోవడంతో కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కొరటాల శివ కూడా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తుండగా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. తమిళ రాక్ స్టార్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.