Amigos Trailer: అమిగోస్ ట్రైలర్.. సంథింగ్ న్యూ కంటెంట్‌తో వస్తున్న కళ్యాణ్ రామ్..!
నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్‌లో కనిపించగా, ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా భారీ వసూళ్లతో కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ మూవీగా బింబిసార నిలిచింది. ఇప్పుడు మరో సరికొత్త కథతో మనముందుకు వస్తున్నాడు ఈ నందమూరి హీరో.

Amigos Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్‌లో కనిపించగా, ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా భారీ వసూళ్లతో కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ మూవీగా బింబిసార నిలిచింది. ఇప్పుడు మరో సరికొత్త కథతో మనముందుకు వస్తున్నాడు ఈ నందమూరి హీరో.
Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్ వచ్చేది ఈరోజే..!
‘అమిగోస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కళ్యాణ్ రామ్ ఈసారి ఏకంగా ట్రిపుల్ రోల్‌లో మనముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్ కంటెంట్‌తో ఉండటంతో ప్రేక్షకులు ఈ ట్రైలర్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌లో సినిమాలోని యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులు ఎలా ఉండబోతున్నాయో మనకు శాంపిల్ చూపెట్టారు.
Amigos: ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ పాటలో ఇరగదీసిన కళ్యాణ్ రామ్..!
ఇక ట్రిపుల్ రోల్‌లో కళ్యాణ్ రామ్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా, రాజేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, ఈనెల 10వ తేదీన అమిగోస్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి సంథింగ్ న్యూ కంటెంట్‌తో రాబోతున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.