Kalyan Ram : నా తమ్ముడు నా గుండెకాయ.. నాకు ఎవరూ లేకపోయినా నా తమ్ముడు ఉన్నాడు..

తాజాగా అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.............

Kalyan Ram : నా తమ్ముడు నా గుండెకాయ.. నాకు ఎవరూ లేకపోయినా నా తమ్ముడు ఉన్నాడు..

Kalyan Ram :  కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్న సినిమా అమిగోస్. యషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు పెంచేశారు. బింబిసార సినిమా తర్వాత మరో సరికొత్త కథతో కళ్యాణ్ రామ్ వస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

Writer Padmabhushan : కలెక్షన్స్ తో అదరగొడుతున్న సుహాస్.. రైటర్ పద్మభూషణ్ లాభాల బాట..

తాజాగా అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నా తమ్ముడు నా గుండెకాయ ఎన్టీఆర్ వచ్చాడు. మా తాతయ్య రాముడు భీముడు సినిమాలో డబల్ రోల్స్ చేశారు. మా బాల బాబాయ్ కూడా చేశారు. ఆ తర్వాత చిరంజీవి, వేరే హీరోలు, మా తమ్ముడు ఎన్టీఆర్ కూడా జైలవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్స్ చేశారు. కానీ ఈ సినిమాలు అన్నిట్లో ఉండే ఈ క్యారెక్టర్స్ ఒకే ఫ్యామిలీకి చెందినవారు. కానీ ఈ సినిమాలో మనుషులు పోలిన మనుషులు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఇలాంటి మంచి సినిమా తెచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్రకి థ్యాంక్స్. ఈ సినిమాలో బ్రహ్మాజీ ఇంకో హీరో. ఈ సినిమా కూడా మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు. ఈ ఫంక్షన్స్ అన్నీ నాకు చాలా చిన్నవి. నా జీవితంలో నాకు సపోర్ట్ చేస్తూ నా పక్కనే ఉన్న నా తమ్ముడికి చాలా థ్యాంక్స్ అని అన్నారు. దీంతో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ గురించి ఇంత గొప్పగా మరోసారి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.