Kamal – Rajini : కమల్ హాసన్‌తో రజినీకాంత్ సినిమా.. కన్‌ఫార్మ్ చేసిన లోకనాయకుడు!

కమల్ హాసన్ అండ్ రజినీకాంత్ కలయికలో ఒక మూవీ పట్టాలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని కమల్ రీసెంట్ ఇంటర్వ్యూలో కన్‌ఫార్మ్ చేశాడు.

Kamal Haasan – Rajinikanth : తమిళ స్టార్ హీరోలు కమల్ హాసన్ అండ్ రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. కమల్ ప్రెజెంట్ ఇండియన్ 2 (Indian 2) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత మణిరత్నం డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే నిర్మాతగా కూడా శింబు, శివ కార్తికేయన్ లతో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక రజినీకాంత్ ఏమో ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నాడు.

Allu Sirish : టెడ్డి బేర్‌తో అల్లు శిరీష్ యాక్షన్.. కొత్త కాన్సెప్ట్‌తో గ్లింప్స్ అదిరిపోయింది!

రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ (Jailer) అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో లాల్ సలాం (Lal Salaam) సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయిన తరువాత రజినీకాంత్.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. కాగా తాజాగా కమల్ నిర్మాణంలో రజినీ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ లోకనాయకుడు కన్‌ఫార్మ్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టోరీ చర్చలు జరుగుతున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

HER Movie : పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా HER.. సరిగమ చేతికి ఆడియో రైట్స్!

అయితే ఈ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమానే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది లోకేష్ డైరెక్ట్ చేస్తాడా? లేదా మరో డైరెక్టర్? అనేది ఎదురు చూడాల్సిందే. కాగా రజినీ జైలర్, కమల్ ఇండియన్ 2 సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. జైలర్ మూవీ ఆగష్టు రిలీజ్ కాబోతుంటే, ఇండియన్ 2 ఏడాది చివరిలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ 2 ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ గేమ్ చెంజర్ ని కూడా తెరకెక్కిస్తుండడంతో ఇండియన్ 2 లేటు అవుతూ వస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు