Kamal Haasan : విక్రమ్ సక్సెస్ మీట్.. సినిమాకి పనిచేసిన వారందరికీ స్పెషల్ పార్టీ..

తాజాగా సినిమాకి పని చేసిన వారందరికీ స్పెషల్ పార్టీ ఇచ్చారు. విక్రమ్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించి లైట్ బాయ్, ప్రొడక్షన్, మేకప్.. ఇలా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాలు పెట్టించారు.............

Kamal Haasan : విక్రమ్ సక్సెస్ మీట్.. సినిమాకి పనిచేసిన వారందరికీ స్పెషల్ పార్టీ..

Kamal Haasan

Vikram :  లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ హిట్ సాధించారు. చాలా రోజుల తర్వాత కమల్ కి బిగ్గెస్ట్ హిట్ రావడంతో కమల్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే విక్రమ్ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేయడంతో ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించిన కమల్ కి డబ్బులు బాగానే వచ్చాయి. దీంతో కమల్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ కి గిఫ్ట్స్, పార్టీలు ఇచ్చారు కమల్..

తాజాగా సినిమాకి పని చేసిన వారందరికీ స్పెషల్ పార్టీ ఇచ్చారు. విక్రమ్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించి లైట్ బాయ్, ప్రొడక్షన్, మేకప్.. ఇలా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాలు పెట్టించారు కమల్ హాసన్. అలాగే సినిమా డిస్ట్రిబ్యూట్‌ చేసిన వారికి, థియేటర్‌ యజమానులకు కూడా ఈ పార్టీ ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్‌ హాసన్‌, లోకేష్‌ కనకరాజ్‌, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్‌, పలువురు తమిళ ప్రముఖులు, సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.

Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

ఇక ఈ సక్సెస్ డిన్నర్ పార్టీలో స్పెషల్ మెనూని ఏర్పాటు చేశారు. వెజ్‌, నాన్‌ వెజ్‌, స్వీట్స్‌, ఐస్‌ క్రీమ్స్‌, మటన్‌ కీమా బాల్స్‌, వంజరం తవా ఫిష్‌ ఫ్రై, నాటు కోడి సూప్, ప్రాన్ పచ్చడి, మైసూర్‌ మసాల దోశ, పన్నీర్‌ టిక్కా, బిర్యానీ…. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. ఈ మెనూని కూడా బ్యానర్ చేపించి పెట్టారు పార్టీలో. ఈ విందులో కమల్ హాసన్‌, లోకేష్ కనకరాజ్‌, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్ అందరూ కూర్చొని అందరితో కలిసి భోజనం చేశారు.

Vikram Success

 

ఇక భోజనాలు అయ్యాక ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో విజయ్ సేతుపతి, లోకేష్‌, ఉదయనిధి స్టాలిన్, అనిరుధ్‌ను కమల్‌ హాసన్‌ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవన్నీ చూస్తుంటే కమల్ ఈ సినిమా సక్సెస్ కి ఫుల్ ఆనందంలో ఉన్నట్టు, ఇప్పట్లో ఈ ఆనందం నుంచి బయటకి వచ్చేలా లేరనిపిస్తుంది.