Sarika : థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా.. ఆర్ధిక సమస్యలలో కమల్ హాసన్ మాజీ భార్య..

సారిక మాట్లాడుతూ.. ''కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చేశాను. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్‌ చేయడం ప్రారంభించాను. అయితే లైఫ్‌ రోటీన్‌గా అనిపించేసరికి ఒక ఏడాది పాటు............

Sarika : థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నా.. ఆర్ధిక సమస్యలలో కమల్ హాసన్ మాజీ భార్య..

Sarika

Sarika :  కమల్ హాసన్ మాజీ భార్య సారిక కమల్ తో 2004లో విడాకులు తీసుకొని ముంబైకి వెళ్లి ఒంటరిగా బతుకుతుంది. కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఇప్పుడు తల్లిని పట్టించుకోవట్లేదు అని సమాచారం. ఒకప్పుడు తమిళ్, హిందీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సారిక కమల్ తో వివాహం తర్వాత సినిమాలకి నటిగా దూరమైనా ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసేది. మళ్ళీ కమల్ తో విడాకుల అనంతరం బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ జీవితం గడుపుతుంది. తాజాగా ఆమె కరోనా కాలంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

 

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ‘మోడ్రన్‌ లవ్‌ ముంబై’ అనే సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది సారిక. దీంతో ఓ బాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన సమస్యలని తెలిపింది. ఇంటర్వ్యూలో సారిక మాట్లాడుతూ.. ”కమల్‌తో విడాకుల అనంతరం తిరిగి ముంబై వచ్చేశాను. మళ్లీ నటిగా చిన్న చిన్న రోల్స్‌ చేయడం ప్రారంభించాను. అయితే లైఫ్‌ రోటీన్‌గా అనిపించేసరికి ఒక ఏడాది పాటు నటనకు బ్రేక్‌ తీసుకున్నా. అదే సమయంలో కరోనా, లాక్‌డౌన్‌లు రావడంతో నా దగ్గరున్న సేవింగ్స్‌ అన్ని అయిపోయాయి. ఏం చేయాలో తెలియదు. దీంతో మళ్ళీ థియేటర్‌ ఆర్టిస్టులతో కలిసి వర్క్‌ చేశాను. అక్కడ రోజుకి 2000 నుంచి 2700 వరకు ఇచ్చేవారు. అది కూడా రోజూ ఉండదు. దీంతో మనం బతకాడానికి అయినా సినిమాల్లో నటించాలి అని ఫిక్స్ అయి మళ్ళీ పాత్రల కోసం చూస్తున్నాను” అని తెలిపింది.

Language War : నా మాతృభాష తమిళ్‌కి అడ్డు పడితే ఊరుకోను.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు..

దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లి అయ్యిండి, స్టార్ హీరో మాజీ భార్య అయి ఉండి ఆమె ఆర్ధిక కష్టాలలో ఉండటమేంటి అని అంతా ఆలోచిస్తున్నారు. కమల్ అంటే విడాకులు ఇచ్చాడు కాబట్టి పట్టించుకోకపోయినా కూతుళ్లు సంపాదిస్తున్నారు కదా, పట్టించుకోవాలి కదా అని నెటిజన్స్ అంటున్నారు.