Kamal Haasan : కోలుకున్న కమల్ హాసన్..

విశ్వ నటుడు కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..

Kamal Haasan : కోలుకున్న కమల్ హాసన్..

Kamal Haasan Health Bulletin

Kamal Haasan: ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తమిళ్‌తో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన వారు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు.

VIKRAM Movie : ‘విక్రమ్’ గా కమల్ ‘విశ్వరూపం’..

ఇటీవల అమెరికా వెళ్లిన కమల్ తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నవంబర్ 22న కమల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పటినుండి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సినీ వర్గాల్లో అలాగే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో డిసెంబర్ 1న కమల్‌కు చికిత్సనందిస్తున్న శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వారు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Bigg Boss Tamil 5 : కమల్ ప్లేస్‌లో రమ్యకృష్ణ

కోవిడ్ పాజిటివ్‌తో ఆసుపత్రిలో జాయిన్ అయిన కమల్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని.. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా డిసెంబర్ 3 వరకు ఐసోలేషన్ ఉంటారని.. డిసెంబర్ 4 నుండి తిరిగి తన కార్యక్రమాల్లో పాల్గొంటారని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వారు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.