Kamal Haasan : ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో నా అప్పులన్నీ తీర్చేస్తా..

కమల్ హాసన్ ఓ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''గతంలో ఒకసారి నేను రూ.300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. నన్ను పిచ్చొడ్ని చూసినట్టు చూశారు. వాళ్లు నన్ను..................

Kamal Haasan : ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో నా అప్పులన్నీ తీర్చేస్తా..

Kamal Haasan

Vikram :  కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్, సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా విక్రమ్. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా చూసిన వారంతా ప్రశంసలు కురిపించారు, చిత్ర యూనిట్ ఇటీవలే సక్సెస్ మీట్స్ నిర్వహించారు. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లని సాధించింది. ఈ సినిమా విజయంపై కమల్ హాసన్ ఎంతో సంతోషంగా ఉన్నారు.

చాలా సంవత్సరాల తర్వాత కమల్ కి బిగ్గెస్ట్ హిట్ రావడమే కాకుండా, కలెక్షన్లు రావడం, కోలీవుడ్ కి కూడా పెద్ద హిట్ రావడంతో ఈ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక సినిమా తీసిన డైరెక్టర్ లోకేష్ ని అందరూ తెగ పొగిడేస్తున్నారు. కమల్ కూడా ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. విక్రమ్ సినిమాకి కమల్ హాసనే నిర్మాత కావడం గమనార్హం. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కమల్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Adire Abhi : జబర్దస్త్ నటుడికి ప్రమాదం.. చేతికి 15 కుట్లు..

కమల్ హాసన్ ఓ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”గతంలో ఒకసారి నేను రూ.300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. నన్ను పిచ్చొడ్ని చూసినట్టు చూశారు. వాళ్లు నన్ను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు విక్రమ్‌ బాక్సాఫీస్‌ వసూళ్లతో నేను అన్న మాట నిజమైంది. విక్రమ్ సినిమాకి వచ్చిన డబ్బులతో నాకు ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాను. నాకు ఇష్టమైన ఆహారాన్ని తింటాను. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సహాయం చేస్తాను. ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తాను. అంతేకాని వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్లకి సాయం చేయాలని నాకు లేదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను” అని తెలిపారు.