30 ఏళ్ల క్రితం ముద్దు పెడితే.. ఇప్పుడు సారీ చెప్పాలా?

ఓ తమిళ చిత్రంలో కమల్ హాసన్, రేఖకు ముద్దు పెట్టిన సన్నివేశం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..

  • Published By: sekhar ,Published On : February 26, 2020 / 06:57 AM IST
30 ఏళ్ల క్రితం ముద్దు పెడితే.. ఇప్పుడు సారీ చెప్పాలా?

ఓ తమిళ చిత్రంలో కమల్ హాసన్, రేఖకు ముద్దు పెట్టిన సన్నివేశం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..

అదేం విచిత్రమో కానీ విశ్వనటుడు కమల్‌హాసన్ పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక అవింకా ఎక్కువయ్యాయి అనే చెప్పాలి. ఇటీవల ‘ఇండియన్ 2’ షూటింగులో జరిగిన ప్రమాదం విషయంలో పోలీసులు దర్శకుడు శంకర్‌తో పాటు కమల్‌కు కూడా నోటీసులు జారీ చేసిన సంగతి మర్చిపోకముందే మరో వివాదంలో కమల్ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ సీనియర్ నటి రేఖ చేసిన కామెంట్స్.. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. బాలచందర్ రూపొందించిన ‘పున్నగాయ్ మన్నన్’ (1986) సినిమాలో రేఖ, కమల్ హాసన్ జంటగా నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఓ ముద్దు సన్నివేశం ఉంది. ఆ ముద్దు సన్నివేశం గురించి తనకు ముందుగా చెప్పలేదని, తన అనుమతి లేకుండానే కమల్ తనకు ముద్దు పెట్టేశారని రేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 

‘‘బాలచందర్ దర్శకత్వంలో ‘పున్నగాయ్ మన్నన్’  సినిమాకు సంబంధించి సూసైడ్ సీన్ షూటింగ్ చేస్తున్నాం. ఒక్కసారిగా కమల్ నాకు ముద్దు పెట్టేశారు. నాకేం అర్థం కాలేదు. ముద్దు సీన్ ఉందని నాకు బాలచందర్ కానీ, కమల్ కానీ చెప్పలేదు. నా అనుమతి లేకుండా కమల్ ముద్దు పెట్టేయడంతో కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి దగ్గరకు వెళ్లి అడిగాను. అందుకు ఆయన.. ‘ఈ ముద్దు సీన్‌లో తప్పేముంది? అందులో ఎలాంటి అసభ్యతా లేదు. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందని చూపించడానికే ఆ సీన్ పెట్టాం’ అన్నారు.

ఆ సీన్ తర్వాత నాకు కొన్ని రోజుల పాటు నిద్ర లేదు. అదో పీడకలలా నన్ను వెంటాడింది. తర్వాత నాకు అవకాశాలు రావడంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు’’ అని రేఖ వెల్లడించారు. ఇదిలా ఉంటే రేఖకు కమల్ క్షమాపణ చెప్పాలి అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ముద్దు పెడితే ఇప్పుడు సారీ చెప్పాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Kamal Haasan - Rekha

Kamal Haasan - Rekha Kiss