Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ''పాన్‌ ఇండియా అనే పదం ఓ కొత్త నాణెం లాంటిది అంతే. పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు కొత్తగా ఏమి రాలేదు. ఎప్పట్నుంచో...............

Kamal Haasan : పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు వచ్చినవి కాదు.. ఎప్పట్నుంచో ఉన్నాయి..

Kamal

Kamal Haasan :  కమల్‌హాసన్‌ మెయిన్ లీడ్ లో విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, సూర్య ముఖ్య పాత్రల్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘విక్రమ్‌’. ఈ సినిమాని లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించారు. విక్రమ్ సినిమా జూన్‌ 3న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పాన్ ఇండియా సినిమా అనే పదం బాగా వినిపిస్తుంది.

BiggBoss 6 : బిగ్‌బాస్‌ 6లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా??

ఈ నేపథ్యంలోనే విక్రమ్ ప్రమోషన్స్ లో కమల్‌ హాసన్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్‌ ఇండియా సినిమాలపై మాట్లాడారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. ”పాన్‌ ఇండియా అనే పదం ఓ కొత్త నాణెం లాంటిది అంతే. పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు కొత్తగా ఏమి రాలేదు. ఎప్పట్నుంచో ఈ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. గతంలో అన్ని భాషల సినిమాలు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. వేరే భాషల్లోకి డబ్బింగ్ చేయకపోయినా, సబ్‌ టైటిల్స్‌ ఇవ్వకపోయినా అన్ని భాషల ప్రజలు ఆదరించిన సినిమాలు ఉన్నాయి. మంచి కథ, చిత్ర నిర్మాణ నాణ్యతలు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ల విజయానికి ముఖ్య కారణం. మన దేశం ఎంతో గొప్పది. అమెరికాలా కాకుండా ఇక్కడ వివిధ భాషలు మాట్లాడినా మనమంతా ఒక్కటే. అదే ఈ దేశానికి అందం’’ అని అన్నారు.