PS2 Movie Trailer: పొన్నియిన్ సెల్వన్-2 ట్రైలర్ రిలీజ్‌కు గెస్ట్‌గా లోకనాయకుడు..?
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా PS-2 మూవీ కూడా ఉందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

Kamal Haasan To Launch PS2 Movie Trailer
PS2 Movie Trailer: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను హిస్టారికల్ సబ్జెక్ట్‌గా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆక్టుటకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా PS-2 మూవీ కూడా ఉందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. దీంతో ఈ సీక్వెల్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
PS2: పొన్నియిన్ సెల్వన్-2 రిలీజ్ వాయిదా.. తూచ్ అంటూ క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంవచ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ ట్రైలర్ లాంచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
PS-2 Movie: ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్-2
చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ట్రైలర్ లాంచ్‌ను మార్చి 29న సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. అయితే, ఈ ఈవెంట్‌కు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ వార్తపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి నిజంగానే PS2 మూవీ ట్రైలర్ లాంచ్‌కు కమల్ హాసన్ వస్తాడా అనేది చూడాలి.