Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్...

Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

Kamal Haasan Vikram Movie Completes Censor Formalities

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ మరోసారి రఫ్ లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో కమల్‌తో పాటు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ యాక్టర్ ఫహాద్ ఫజిల్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ తమిళ ఆడియెన్స్‌లో ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది.

Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!

ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. చాలా రోజుల తరువాత కమల్ నుండి పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నామని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌తో అన్నారట. ఇక ఈ సినిమా అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని వారు కితాబిచ్చారట.

Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!

అటు ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను కూడా చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఈ సినిమాను 153 నిమిషాలకు లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. జూన్ 3వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాను చూసేందుకు తాము ఎంత ఉత్సాహంగా ఉన్నారో అభిమానులు ఇప్పటికే బుక్‌మై‌షో పోర్టల్‌లో రికార్డు స్థాయిలో తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అదనపు బలంగా మారనుండగా, రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి విక్రమ్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.