Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర....

Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్

Kamal Haasan Vikram To Have Grand Release In Telugu

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే కమల్ సినిమాలకు తెలుగులోనూ భారీ రెస్పాన్స్ లభిస్తూ వస్తుంది. ఈనేపథ్యంలోనే విక్రమ్ సినిమాను తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రైట్స్ ను హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?

కాగా.. జూన్ 3న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయిన నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే నితిన్ తండ్రి, నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తాజాగా చెన్నైలో కమల్ హాసన్ ను కలిశారు. ఈ సందర్భంగా విక్రమ్ తెలుగు పోస్టర్ ను హీరో కమల్ హాసన్ కు అందించారు. తెలుగులో ప్రమోషన్స్, రిలీజ్ స్ట్రాటజీల గురించి కమల్ ఆయనతో చర్చించారు. ఇక తెలుగులోనూ ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!

ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం ఖాయమని, త్వరలోనే తెలుగులో నిర్వహించే ఈవెంట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తామని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో కమల్ ఊరమాస్ లుక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవగా, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అటు మరో తమిళ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అదనపు బలం కాగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీని అందించారు.