NTR31: తారక్‌తో కమల్.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

NTR31: తారక్‌తో కమల్.. ప్రశాంత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Ntr31

NTR31: బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్ తో జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. కొరటాల సినిమా పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ఏ సినిమా మొదలు పెట్టనున్నాడన్నది కూడా చాలా కాలంగా ఇంట్రెస్టింగ్ క్వచ్చిన్ గానే ఉంది.

NTR 30: కొరటాల సినిమాకు ఆ ఇద్దరూ.. ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా?

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ తో సినిమాలు కమిట్ అయ్యాడు. ఇందులో ఏ సినిమా ముందుగా మొదలవుతుందన్నది చాలా కాలంగా ఆసక్తిగా మారింది. ఇందులో ప్రశాంత్ నీల్ సినిమానే ముందు పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తుందని ఓ ప్రచారం సాగుతుంది. అయితే.. ప్రస్తుతం సలార్ తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూర్తవగానే కేజీఎఫ్ 3 మొదలు పెట్టనున్నారని ఈ మధ్యనే కేజీఎఫ్ నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

NTR: ఎన్టీఆర్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

సినిమా ఎప్పుడన్నది స్పష్టత లేదు కానీ.. ఈ సినిమా మీద ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు ఓ సెన్సేషనల్ టాక్ మొదలైంది. అదేంటంటే.. ఇందులో హీరో తర్వాత మరో స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా ఉందని.. ఈ పాత్ర కోసం ప్రశాంత్ విశ్వనటుడు కమల్ హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడని ఓ టాక్ మొదలైంది. ఒకవేళ ఈ టాక్ నిజమైతే అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా పండగే. సీనియర్స్ జనేరేషన్ లో కమల్ నటనకు మిగతా హీరోలు కూడా ఫిదా అయితే.. ఈ జనరేషన్ లో తారక్ ఆ స్థాయి నటుడుగా పేరుంది. మరి ఈ ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ వస్తే.. బొమ్మ దద్దరిల్లడం ఖాయం.