విశ్వనటుడు ఊరికే అవరు : స్పాట్‌లో పది వేరియేషన్స్ చూపించిన కమల్ హాసన్

‘యూనివర్శల్ స్టార్’ కమల్ హాసన్.. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘దశావతారం’లో ఆయన పోషించిన పది పాత్రల తాలూకు వాయిస్‌లను వినిపించి తమిళ ప్రేక్షకులను అలరించారు..

  • Published By: sekhar ,Published On : October 28, 2019 / 08:12 AM IST
విశ్వనటుడు ఊరికే అవరు : స్పాట్‌లో పది వేరియేషన్స్ చూపించిన కమల్ హాసన్

‘యూనివర్శల్ స్టార్’ కమల్ హాసన్.. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘దశావతారం’లో ఆయన పోషించిన పది పాత్రల తాలూకు వాయిస్‌లను వినిపించి తమిళ ప్రేక్షకులను అలరించారు..

‘విశ్వనటుడు’ కమల్ హాసన్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనో నట గ్రంథాలయం.. రీసెంట్‌గా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కమల్ తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, ‘యూనివర్శల్ స్టార్’ కమల్ హాసన్.. పది డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన సినిమా.. ‘దశావతారం’..

2008లో విడుదలైన ఈ సినిమాలో కమల్ నటన, క్యారెక్టర్‌కీ.. క్యారెక్టర్‌కీ మధ్య ఆయన చూపించిన వైవిధ్యం.. అద్భుతం.. తెలుగులో పది పాత్రలకీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ చెప్పారు. తమిళ్‌లో కమల్ డబ్బింగ్ చెప్పుకున్నారు.

Read Also : మెగా ఫ్యామిలీ దివాళీ సెలబ్రేషన్స్

రీసెంట్‌గా చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ‘దశావతారం’లో ఆయన పోషించిన పది పాత్రల తాలూకు వాయిస్‌లను వినిపించి తమిళ ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్‌కి తగ్గట్టు ఆయన చూపించిన వత్యాసం చూసి చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.