Kangana Ranaut: హాలీవుడ్ కథలకు ఇన్స్ పిరేషన్ మన వేదాలే.. కంగనా కొత్త కామెంట్స్! Kangana new comments, Inspiration for Hollywood stories is our Vedas

Kangana Ranaut: హాలీవుడ్ కథలకు ఇన్స్ పిరేషన్ మన వేదాలే.. కంగనా కొత్త కామెంట్స్!

హిందూ వేదాల నుంచే హాలీవుడ్ కథలు పుడుతున్నాయి. మహాభారతం ఆధారంగానే అవెంజర్స్ వచ్చారంటోంది కంగనా రనౌత్. తన కొత్త మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా డిఫరెంట్ స్టేట్ మెంట్స్ పాస్ చేస్తోంది.

Kangana Ranaut: హాలీవుడ్ కథలకు ఇన్స్ పిరేషన్ మన వేదాలే.. కంగనా కొత్త కామెంట్స్!

Kangana Ranaut: హిందూ వేదాల నుంచే హాలీవుడ్ కథలు పుడుతున్నాయి. మహాభారతం ఆధారంగానే అవెంజర్స్ వచ్చారంటోంది కంగనా రనౌత్. తన కొత్త మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా డిఫరెంట్ స్టేట్ మెంట్స్ పాస్ చేస్తోంది. అసలు ధక్కడ్ క్యారెక్టర్ కూడా తాను బలవంతంగా చేసానని.. ప్రొడ్యూసర్స్ ఒప్పిస్తేనే చేసానని కబుర్లు చెబుతోంది కంగనా.

Kangana Ranaut : అందుకే నాకు పెళ్లి కావట్లేదు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలు..

మే 20న కంగనా నటించిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ధక్కడ్ రిలీజ్ కానుంది. జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ స్టోరీ థక్కడ్ లో సూపర్ హీరోయిన్ గా కంగనా కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తోంది. భారతీయ వేదాల నుంచే వెస్ట్ నుంచి సూపర్ హీరో సినిమాలొస్తున్నాయి అనేది కంగనా వర్షన్. మహాభారతంలోని క్యారెక్టర్స్ ఆధారంగా అవెంజర్స్ లాంటి సినిమాలు పుట్టుకొస్తున్నాయంటోంది ఆమె.

Kangana Ranaut : యోగిని కలిసిన బాలీవుడ్ క్వీన్.. మహారాజ్ జీ అంటూ పోస్ట్..

సూపర్ హీరో ఐరన్ మ్యాన్ ఆర్మర్ ను చూస్తుంటే.. మహాభారతంలోని కర్ణుని కవచ కుండలాలు గుర్తొస్తాయి. అలాగే థోర్ పట్టుకునే ఆయుధాన్ని చూసినప్పుడు హనుమంతుని గద కళ్ల ముందు మెదులుతుందని కంగనా చెప్తోంది. విజువల్ ట్రీట్ మెంట్ మారొచ్చు కానీ అవెంజర్స్ సైతం మహాభారతం ఇన్స్ పిరేషన్ గా ముందుకొచ్చిందంటోంది కంగనా. ఇక ధక్కడ్ సినిమా ముందు తాను చేయగలనా అనే డౌట్ ఉండేదని.. ప్రొడ్యూసర్స్ ప్రోత్సాహం వలనే ఈ సినిమా చేసిందట కంగనా. అలాగే అందరితో తాను గొడవ పడతానని లేనిపోనివి ఊహించుకోవడం వల్లే తనకింకా పెళ్లి కావట్లేదని ఈ హీరోయిన్ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరలయ్యాయి.

×