Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..

తాజాగా కంగనా ఈ సారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై వ్యాఖ్యలు చేసింది. ధాకడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా మాట్లాడుతూ.. ''ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ లో వచ్చే సినిమాల్లో చాలా వరకు.........

Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..

Kangana (1)

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దొరికినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ హీరోల మీద, బాలీవుడ్ స్టార్ కిడ్స్ మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కంగనా ధాకడ్ సినిమాతో మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత రెండు వారాల నుంచి కంగనా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు సందర్భాలలో కంగనా మరోసారి బాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ సినిమాలపై విరుచుకు పడుతూనే ఉంది.

 

తాజాగా కంగనా ఈ సారి బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై వ్యాఖ్యలు చేసింది. ధాకడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా మాట్లాడుతూ.. ”ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ లో వచ్చే సినిమాల్లో చాలా వరకు బాలీవుడ్ స్టార్ల పిల్లలే నటిస్తున్నారు. వాళ్లేమో చదువుల కోసం చిన్నప్పటి నుంచి విదేశాల్లో ఉన్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన వాళ్లకి ఇక్కడి పద్ధతులు ఎలా తెలుస్తాయి. వాళ్ల భాష, ఆహరం అన్ని వేరు. వాళ్ల లుక్స్‌ కూడా భయంకరంగా, ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడి ప్రేక్షకులు వాళ్ళకి ఎందుకు కనెక్ట్‌ అవుతారు” అని అనడంతో మరోసారి కంగనా వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Yash : KGF 2 ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాల్సిందే.. వర్కౌట్ అవుతుందా??

అంతే కాక కంగనా బాలీవుడ్, సౌత్ కి డిఫరెన్స్ కూడా చెప్పింది. కంగనా మాట్లాడుతూ.. ”సౌత్ సినిమా వాళ్లు ఆడియన్స్‌తో కనెక్ట్‌ అయ్యే సినిమాలు చేస్తున్నారు. సౌత్ హీరోలు ఎలాంటి పాత్రల్లోనైనా నటించడానికి ఆసక్తి చూపిస్తారు. ఉదాహరణకి ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో హీరో కూలీ పని చేసే వ్యక్తిగా కనిపించాడు. కానీ బాలీవుడ్ హీరోలు అలా చేస్తారా? సౌత్ సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇస్తారు. అందుకే ఆ సినిమాలు దేశంలోని అన్నీ రకాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతున్నాయి” అని తెలిపింది.