Sita Ramam: ‘సీతా రామం’పై కంగనా కామెంట్స్.. ఏమందంటే..?

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన ‘సీతా రామం’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా సీతా రామం చిత్రాన్ని చూసింది. ఈ సినిమాపై తన కామెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Sita Ramam: ‘సీతా రామం’పై కంగనా కామెంట్స్.. ఏమందంటే..?

Kangana Ranaut Comments On Sita Ramam Movie

Sita Ramam: టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన ‘సీతా రామం’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.

Sita Ramam: మళ్లీ వస్తోన్న సీతా రామం కాంబో.. అయితే అది మాత్రం కాదట!

కాగా, ఇటీవల ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండటంతో, పలువురు ప్రముఖులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో సీతారామం చిత్రంపై తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా సీతా రామం చిత్రాన్ని చూసింది. ఈ సినిమాపై తన కామెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Sita Ramam: పెళ్లి కాకుండా పిల్లలని కంటానంటున్న సీతారామం హీరోయిన్..

సీతా రామం చిత్రం అద్భుతంగా ఉందని.. ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే అత్యద్భుతంగా కుదిరాయని ఆమె పేర్కొంది. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను కంగనా ఆకాశానికెత్తింది. సీతా మహాలక్ష్మీ పాత్రలో, ప్రిన్సెస్ నూర్‌జహాన్ పాత్రలో మృణాల్ పర్ఫార్మెన్స్ ఔట్‌స్టాండింగ్‌గా ఉందని కంగనా కితాబిచ్చింది. ఈ ఎపిక్ లవ్ స్టోరీని ఎట్టకేలకు వీక్షించే సమయం తనకు దొరికిందని.. ఈ సినిమాకు హను రాఘవపూడి డైరెక్షన్ అమోఘంగా ఉందని కంగనా పేర్కొంది. మొత్తానికి ‘సీతా రామం’ మూవీకి బాలీవుడ్ క్వీన్ కూడా ఫిదా కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.