Kangana Ranaut : పొలంలో పనిచేస్తున్న కంగనా రనౌత్ తల్లి.. నేను రిచ్ అయినంత మాత్రాన మా అమ్మ రిచ్ కాదు.. కంగనా వ్యాఖ్యలు..

తాజాగా ఓ నెటిజన్ కంగనా తల్లి పొలంలో వర్క్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసి కంగనా చాలా ధనవంతురాలు కదా, మరి కంగనా తల్లి ఇంకా పొలంలో ఇలా పనిచేసుకుంటుంది. ఇంతటి సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. ఆ పోస్టుని రీ ట్వీట్ చేసి కంగనా.................

Kangana Ranaut : పొలంలో పనిచేస్తున్న కంగనా రనౌత్ తల్లి.. నేను రిచ్ అయినంత మాత్రాన మా అమ్మ రిచ్ కాదు.. కంగనా వ్యాఖ్యలు..

Kangana Ranaut emotional comments on her mother and shares about her mother simplicity

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం వుమన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇక దేశం, ధర్మం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తనని ఎవరన్నా విమర్శించినా ఫైర్ అవుతుంది. బాలీవుడ్ మాఫియాపై ఓపెన్ గానే అందరిపై విమర్శలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ మాఫియాతో కలవకుండా సపరేట్ గా చాలా వరకు సింగిల్ గానే ఉంటుంది కంగనా. దేశంలో జరిగే పలు రకాల సంఘటనలపై రెగ్యులర్ గా రియాక్ట్ అవుతుంది కంగనా.

తాజాగా ఓ నెటిజన్ కంగనా తల్లి పొలంలో వర్క్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసి కంగనా చాలా ధనవంతురాలు కదా, మరి కంగనా తల్లి ఇంకా పొలంలో ఇలా పనిచేసుకుంటుంది. ఇంతటి సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. ఆ పోస్టుని రీ ట్వీట్ చేసి కంగనా.. నేను ధనవంతురాలు అవ్వడం వల్ల నా తల్లి ధనవంతురాలు కాదు. నేను రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా ఉంది. సినిమా మాఫియా మీద నేను చూపిస్తున్న వైఖరి ఎక్కడ నుంచి వచ్చిందో మీకు అర్థమైపోయింది అనుకుంట. మా అమ్మ అన్ని నేర్పించింది. నేను సినిమా మాఫియాలోని వాళ్ళ లాగా పెళ్ళిళ్ళల్లో డబ్బుల కోసం డ్యాన్సులు వేయను అని చెప్పింది.

అలాగే తన తల్లి పొలంలో పనిచేసే ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. మా అమ్మ ప్రతి రోజు మా పొలంలో దాదాపు 7 గంటలు పనిచేస్తుంది. మా అమ్మకు బయట రెస్టారెంట్స్ లో తినడం, విదేశాలకు వెళ్లడం, సినిమాలు చూడటం, సినిమా సెట్స్ కి రావడం, ఆఖరికి ముంబైలో నివసించడం కూడా నచ్చదు. వీటిల్లో ఏదైనా చేయమని నేను బలవంతపెడితే నన్ను తిడుతుంది. సినిమా మాఫియాని నేను వ్యతిరేకించడం అందరూ నా అహంకారం అంటారు. కానీ నేను మా అమ్మ చెప్పిన వ్యక్తిత్వాన్ని పాటిస్తున్నాను. నేను ఎవర్ని వేడుకొను, వేరే హీరోయిన్స్ లాగా సిగ్గుపడను, పెళ్ళిళ్ళల్లో డ్యాన్సులు చేయను, హీరోల గదులకు వెళ్ళను. అందుకే వాళ్ళు నను పట్టించుకోరు. మీరే చెప్పండి ఇది అహంకారామా? చిత్తశుద్దా? అని పోస్ట్ చేసింది.

Armaan Malik : యూట్యూబర్ పై ఫైర్ అయిన బుట్టబొమ్మ సింగర్..

అలాగే ఇప్పుడు నేనే తీసే సినిమాకు కూడా ప్రతి పైసా నేను కష్టపడి సంపాదించింది పెడుతున్నాను. పొలాల్లో పనిచేస్తున్న మా అమ్మని చూసినప్పుడు నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. మా అమ్మని చూసి నేను విజయం సాధిస్తూ ఉంటాను. మా అమ్మే నాకు అన్ని నేర్పింది అంటూ తన తల్లి గురించి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది కంగనా. దీంతో కంగనా తన తల్లిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.