Kangana Ranaut: కంగనా రనౌత్‭ అకౌంట్‭పై బ్యాన్ ఎత్తేసిన ట్విట్టర్.. కంగనా చేసిన మొదటి ట్వీట్ ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం ఆందోళన చేపట్టారు. అయితే ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించే కంగనా, ఓ సందర్భంలో రైతులను ‘ఖలిస్తానీలు, దేశద్రోహులు’ అంటూ వ్యాఖ్యానించారు. విధ్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కంగనా ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది.

Kangana Ranaut: కంగనా రనౌత్‭ అకౌంట్‭పై బ్యాన్ ఎత్తేసిన ట్విట్టర్.. కంగనా చేసిన మొదటి ట్వీట్ ఏంటంటే?

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అకౌంట్ మీద విధించిన నిషేధాన్ని ట్విట్టర్ ఎత్తివేసింది. 2021, ఏప్రిల్ 4వ తేదీన కంగనా అకౌంట్ మీద నిషేధాన్ని విధించారు. కంగనా అకౌంట్ రీస్టోర్ చేయాలంటూ ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పటికీ ట్విట్టర్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అయితే ట్విట్టర్‭ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న అనంతరం.. కంగనా అకౌంట్ రీస్టోర్ అవుతుందనే ఊహాగాణాలు నడిచాయి. దానికి కారణం, డొనాల్డ్ ట్రంప్ ఖాతాను రీస్టోర్ చేయడం.

Pathaan : రిలీజ్ కి ముందే 50 కోట్ల వసూళ్లు.. ఇక రిలీజయితే.. 100 దేశాల్లో షారుఖ్ కంబ్యాక్ మూవీ విడుదల..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం ఆందోళన చేపట్టారు. అయితే ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించే కంగనా, ఓ సందర్భంలో రైతులను ‘ఖలిస్తానీలు, దేశద్రోహులు’ అంటూ వ్యాఖ్యానించారు. విధ్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కంగనా ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. అంతకు ముందు రెండు, మూడు ట్వీట్లపై కూడా ఫ్లాగ్ వేశారు (తప్పుడు సమాచారం, విధ్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ఉందని హెచ్చరిక చేయడం).

Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర ..

ఇక ట్విట్టర్ ఖాతా రీస్టోర్ అవ్వగానే కంగనా స్పందిస్తూ ‘‘అందరికీ నమస్కారం. ఇక్కడికి తిరిగి రావడం బాగుంది’’ అంటూ ట్వీట్ చేసింది. వెంటనే తన డెస్క్ టాప్ ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చేసింది. ఇక కంగనా అభిమానులు అయితే తమ ఆనందాన్ని నెట్టింట్లో వ్యక్తం చేస్తున్నారు. ‘క్వీర్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‭లో #KanganaRanaut అనే హ్యాష్‭ట్యాగ్ టాప్ ట్రెండింగులో ఉంది.