Kangana Ranaut : ప్రియాంక, శ్రుతి ఇప్పుడు మాట్లాడుతున్నారు.. కానీ కంగనా ఆ విషయంలో ఎన్నో సమస్యలను..
ప్రియాంక చోప్రా, శ్రుతిహాసన్ ఇప్పుడు ఆ విషయం గురించి ఇంటర్నేషనల్ స్టేజిలు పై కూడా మాట్లాడుతున్నారు. కానీ అదే విషయం పై కంగనా ఎప్పుడో మాట్లాడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.

Kangana Ranaut Priyanka Chopra Shruti Haasan speaks about gender difference in industry
Priyanka Chopra – Shruti Haasan : ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో లింగ సమానత్వం గురించి చర్చ జరుగుతుంది. రెమ్యునరేషన్ విషయంలో హీరో హీరోయిన్లు మధ్య డిఫరెన్స్ చూపిస్తున్నారు అంటూ పలువురు హీరోయిన్లు బయటకి వచ్చి మాట్లాడుతున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి చెక్కేసిన ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక సౌత్ హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా ఇటీవల పలు ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది.
Vishwak Sen : మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన విశ్వక్.. ఏ మూవీకో తెలుసా?
అలాగే మొన్న 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో పాల్గొనగా, అక్కడ కూడా శ్రుతి.. ‘హీరోలకు సమానంగా హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయం గురించి ఇప్పుడు వీరిద్దరూ మాట్లాడుతున్నారు గాని, కంగనా ఇదే విషయమై మాట్లాడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. అలా అడిగినందుకు కంగనా పాత్రను మరొకరితో చేయించేవారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోతో సమానంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఒక్క కంగనా మాత్రమే.
SSMB28 Title Glimpse : బీడీ 3d లో కనబడుతోందా.. మహేష్ మాస్ స్ట్రైక్ అదిరిపోయింది!
ఈ విషయాన్ని కంగనానే వెల్లడించింది. ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతూ కంగనా.. “ఇండస్ట్రీలోనే మిగతా హీరోయిన్లు తన మాదిరి ఎందుకు రెమ్యునరేషన్ తీసుకోలేకపోతున్నారో అనేది వాళ్ళని వాళ్లే ప్రశ్నించుకోవాలి” అంటూ పేర్కొంది. కాగా ఇప్పుడు ఈ అంశం పై అయితే ఒక్కొక్కరిగా హీరోయిన్లు అంతా మాట్లాడుతున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.