Kangana Ranaut : పూరి – ప్రభాస్ ఒక్క ఛాన్స్ ప్లీజ్..!

ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా సెట్ చెయ్యమని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ని రిక్వెస్ట్ చేస్తోంది..

Kangana Ranaut : పూరి – ప్రభాస్ ఒక్క ఛాన్స్ ప్లీజ్..!

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సినిమా ఛాన్స్ కావాలని అడుగుతోంది. ఎన్నాళ్లనుంచో సినిమా చెయ్యాలని వెయిట్ చేస్తున్నాను.. ప్రభాస్‌తో సినిమా సెట్ చెయ్యమని ఓ డైరెక్టర్‌ని చాలా కాలం నుంచి అడుగుతున్నాను.. కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఇప్పటి వరకూ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదని కంప్లైంట్ ఇస్తోంది కంగనా..

MAA Building : మోహన్ బాబుకి నాగబాబు కౌంటర్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ‘తలైవి’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. సెప్టెంబర్ 10న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది ‘తలైవి’ సినిమా. ఫస్ట్ టైమ్ సౌత్ బయోపిక్ జయలలిత స్టోరీతో వస్తున్న కంగనా.. ఈ సినిమా ప్రమోషన్లతో పాటు టాలీవుడ్ రీ ఎంట్రీ గురించి కూడా తన ఇంట్రెస్ట్ బయటపెట్టింది.

Ilaa Ilaa song : ‘తలైవి’ వీడియో సాంగ్ చూశారా!.. కంగనా అదరగొట్టేసింది..

‘తలైవి’ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తోన్న కంగనా తెలుగులో రీ ఎంట్రీకి రెడీ అంటోంది. తెలుగులో ప్రభాస్‌తో మళ్లీ సినిమా చెయ్యాలని కూడా చూస్తున్నట్టు చెప్పింది. ఆల్రెడీ తెలుగులో పూరీ జగన్‌తో ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసిన కంగనా.. తెలుగులో మరోసారి నటించే ఛాన్స్ కూడా పూరీనే ఇవ్వాలంటోంది.

Divi Vadthya: ప్రభాస్‌తో కప్పు కాఫీ తాగినా చాలు.. దివి లవ్ ప్రపోజల్!

తెలుగులో సినిమా చేస్తానని చెప్పడమే కాదు.. సౌత్ ఆడియన్స్ చాలా ప్లజెంట్ పీపుల్ అని, వెరీ వెల్‌కమింగ్ అని, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా స్టార్స్‌ని ట్రీట్ చేస్తారని తెగ పొగిడేసింది. అందుకే బాలీవుడ్ జనాల కన్నా సౌత్ ఆడియన్స్ చాలా మంచి వాళ్లని కాంప్లిమెంట్ ఇచ్చింది కంగనా. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు కంగనా, ప్రభాస్, పూరీ. మరి కంగనా అనుకున్నట్టు ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందా..? అనుకుంటున్నారు ఆడియన్స్.