Kangana Ranaut : దేశ వ్యతిరేకుల గురించి మాట్లాడినందుకు.. సంవత్సరానికి 40 కోట్లు నష్టపోతున్నాను.. అయినా సరే..

ఇటీవల ఎలాన్ మస్క్(Elon Musk).. నేను నాకిష్టమైందే చేస్తాను. నేను నమ్మిన దానిపై నిలబడతాను, దాని వల్ల డబ్బులు నష్టపోయినా పర్లేదు అని అన్నాడు. ఎలాన్ చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ తన స్టోరీలో షేర్ చేసింది కంగనా.

Kangana Ranaut : దేశ వ్యతిరేకుల గురించి మాట్లాడినందుకు.. సంవత్సరానికి 40 కోట్లు నష్టపోతున్నాను.. అయినా సరే..

Kangana Ranaut sensational comments on Some Brands and support to elon musk

Kangana Ranaut :  బాలీవుడ్(Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ మాఫియా అంటూ పలువురిపై విమర్శలు చేస్తుంది. ఇక దేశం, ధర్మం గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళని కూడా బహిరంగంగానే విమర్శిస్తోంది. హిందుత్వం(Hinduthvam) గురించి మాట్లాడుతుంటుంది. సినిమాలతో బిజీగా ఉన్నా దేశంలోని పలు అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటుంది కంగనా. వాటిపై సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తుంది. తాజాగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఇటీవల ఎలాన్ మస్క్(Elon Musk).. నేను నాకిష్టమైందే చేస్తాను. నేను నమ్మిన దానిపై నిలబడతాను, దాని వల్ల డబ్బులు నష్టపోయినా పర్లేదు అని అన్నాడు. ఎలాన్ చేసిన వ్యాఖ్యలను తన స్టోరీలో షేర్ చేసింది కంగనా.

Arpita Khan : సల్మాన్ సోదరి ఇంట్లో చోరీ.. 5 లక్షలు విలువ చేసే ఆభరణాలు మాయం..

ఎలాన్ వ్యాఖ్యలకు సపోర్ట్ గా.. నేను కూడా హిందుత్వం గురించి మాట్లాడటం వల్ల, రాజకీయ నాయకులు, దేశ వ్యతిరేకులకు, తుక్కడే గ్యాంగ్ గురించి మాట్లాడటం వల్ల నాకు 20 నుంచి 25 బ్రాండ్ ఎండార్స్మెంట్ లు పోయాయి. రాత్రికి రాత్రే కొన్ని బ్రాండ్స్ నుంచి నన్ను తప్పించారు. కొన్ని సినిమాల నుంచి కూడా నన్ను తప్పించారు. దానివల్ల నాకు సంవత్సరానికి 30 నుంచి 40 కోట్ల నష్టం వస్తుంది. కానీ నేను స్వేచ్ఛగా ఉన్నాను. నాకు నచ్చింది మాట్లాడుతున్నాను. భారతదేశాన్ని, దేశ సంస్కృతిని వ్యతిరేకించే మల్టీనేషనల్ కంపెనీలు, వాటి హెడ్స్ కూడా నేను చెప్పాలనుకున్నది ఆపలేరు. ఈ విషయంలో నేను ఎలాన్ ని అభినందిస్తున్నాను. కనీసం డబ్బు ఉన్నవాళ్ళైనా డబ్బుల గురించి పట్టించుకోకూడదు. ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లే ఎక్కువ కోల్పోతారు అని కంగనా రాసింది. దీంతో మరోసారి కంగనా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Kangana comments