Chandramukhi 2: చంద్రముఖిగా మారుతున్న మణికర్ణిక.. ఇక విధ్వంసమే!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పి.వాసు తెరకెక్కించగా, జ్యోతిక పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇప్పుడు చాలా కాలం తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను దర్శకుడు పి.వాసు తెరకెక్కిస్తుండగా, ఈసారి చంద్రముఖిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మారబోతున్నట్లు తెలుస్తోంది.

Chandramukhi 2: చంద్రముఖిగా మారుతున్న మణికర్ణిక.. ఇక విధ్వంసమే!

Kangana Ranaut To Star In Chandramukhi 2

Chandramukhi 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పి.వాసు తెరకెక్కించగా, జ్యోతిక పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా చంద్రముఖి పాత్రలో ఆమె చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు చాలా కాలం తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను దర్శకుడు పి.వాసు తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Chandramukhi 2: చంద్రముఖి సీక్వెల్ అప్పుడే లాక్ చేసిందా..?

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే ‘చంద్రముఖి-2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మూవీలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమాలో ఓ స్టార్ బ్యూటీ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈసారి చంద్రముఖిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో ఒక్కసారిగా చంద్రముఖి-2 సినిమాపై నెట్టింట చర్చ జోరందుకుంది. బాలీవుడ్‌లో ఎప్పుడూ వివాదాల్లో నిలిచే ఈ స్టార్ హీరోయిన్, ఈసారి తన నటవిశ్వరూపం చూపించడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

Chandramukhi 2: అలా మొదలెట్టి, ఇలా ముగించేసిన చంద్రముఖి-2

ఏదేమైనా చంద్రముఖి లాంటి పాత్రలో కంగనా నిజంగా నటిస్తే, ఆమె అభిమానులకు అది ఫీస్ట్ అని చెప్పాలి. ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం ఇప్పటికే చూశాం. మరి చంద్రముఖిగా మారుతున్న కంగనా, ప్రేక్షకులను ఏ రేంజ్‌లో భయపెడుతుందో చూడాలి.