Kangana Ranaut : మొన్న విమర్శ, నేడు శుభాకాంక్షలు.. స్వర భాస్కర్‌కి కంగనా ట్వీట్!

బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, తోటి నటీనటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ట్వీట్ చేసింది.

Kangana Ranaut : మొన్న విమర్శ, నేడు శుభాకాంక్షలు.. స్వర భాస్కర్‌కి కంగనా ట్వీట్!

Kangana Ranaut swara bhaskar

Kangana Ranaut : బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌ సీక్రెట్ పెళ్లి చేసుకొని, ఆ విషయాన్ని నిన్న (ఫిబ్రవరి 16) తన ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేసింది. ప్రముఖ రాజకీయ యూత్ లీడర్ అయిన ఫహద్ అహ్మద్ ని ప్రేమించి వివాహం చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. రాజకీయ వ్యవహారాలతో మొదలైన వీరిద్దరి స్నేహం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు చేరింది. గత కొంతం కాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్న వీరిద్దరూ జనవరి 6న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని ఒకటయ్యారు.

Kangana Ranaut : చంద్రముఖి 2లో ఆమెని మ్యాచ్ చేయటం కష్టం అంటూ జ్యోతికని పొగిడేసిన కంగనా..

అయితే ఆ విషయాన్ని మాత్రం నిన్న అందరికి తెలియజేసింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక కోర్టులో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒకటైనట్లు తెలియజేస్తూ ఒక వీడియోని విడుదల చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, తోటి నటీనటులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ట్వీట్ చేసింది. గతంలో కంగనా, స్వర భాస్కర్ కలిసి ‘తను వెడ్స్ మను’ 1-2 సినిమాల్లో నటించారు.

కాగా 2020లో కంగనా.. స్వర మరియు తాప్సీ పన్ను పై తీవ్ర విమర్శలు చేసింది. వారిద్దర్నీ బి-గ్రేడ్ నటీమణులు అంటూ కామెంట్లు చేసింది. ఆ వ్యాఖ్యలతో ఆ సమయంలో కంగనా, స్వర భాస్కర్‌ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. తాజాగా ఇప్పుడు స్వర చెప్పిన పెళ్లి శుభవార్తకు కంగనా స్పందింస్తూ.. “పెళ్లిళ్లు మనసుకి సంబంధించింది, మిగిలినవి అన్ని ఫార్మాలిటీస్. మీ ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు కలగాలి” అంటూ ట్వీట్ చేసింది. స్వర భాస్కర్ తో గొడవ తరువాత కంగనా ఆమె పై పాజిటివ్ ట్వీట్ వెయ్యడంతో ప్రస్తుతం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.