Thalaivi Trailer: తలైవి.. తూటాల్లా పేలుతోన్న డైలాగ్‌లు..

Thalaivi Trailer: తలైవి.. తూటాల్లా పేలుతోన్న డైలాగ్‌లు..

Thalaivi Trailer

Thalaivi Trailer: చిత్రరంగంలోనూ.. తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి.. ముఖ్యమంత్రిగా ప్రజల్లో అమ్మగా పేరుగాంచిన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘తలైవి’. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ లేటెస్ట్‌గా ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అమ్మ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించగా.. ట్రైలర్ చూస్తుంటే పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

2

బాలీవుడ్‌లో కంగనా రనౌత్ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించి తనకంటూ సపరేట్ ఇమేజ్, పాపులారిటీని దక్కించుకోగా.. తలైవి కూడా ఏ మాత్రం తగ్గదు అనిపిస్తుంది. లెజెండరీ రైటర్, బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.., దర్శకుడు విజయ్ తెరకెక్కించిన సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంది. ‘అమ్మ’ పాత్రలో కంగనా ఒదిగిపోగా.. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి.

Thalaivi2

ఒక్క తమిళనాడు ప్రజల మీదే ఫోకస్ చేసినట్లుగా కాకుండా.. దక్షిణాది ప్రజల ఆత్మగౌరవంపై ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.. ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు మంచి ఇంగ్లీష్ రాదు అనుకునే ఉత్తరాదివారికి చెప్పిన పంచ్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్‌ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానించే ఘట్టం అధ్భుతంగా ఉంది.

Jaya

నిండు అసెంబ్లీలో జయలలిత చీరను లాగిన ఘట్టం సినిమాలో చూపించగా.. ‘మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది. తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది..జయ’ అంటూ కంగనా చెబుతున్న డైలాగ్‌ హైలెట్. కంగన పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ట్రైలర్‌ విడుదల చేశారు.

Thalaivi

ఈ సంధర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయ కోణంలో కాకుండా, పురుషాధిక్య ప్రపంచంలో విజయం సాధించిన ఓ మహిళ అనే కోణంలో చిత్రాన్ని చూడాలి’’ అన్నారు. కంగనా రనౌత్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడు విజయ్‌ నన్ను హీరోయిన్‌గా కాకుండా హీరోలా ట్రీట్‌ చేశారు. దక్షిణాదిలో ఎటువంటి గ్రూపిజానికి తావులేదు. అందుకే, తమిళంలో చాలా చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఎంజీఆర్‌ పాత్రను ఇష్టపడి చేశానని అరవింద్‌ స్వామి అన్నారు. ‘‘ఎవరికీ తలవంచని ఉక్కు మహిళ జయలలిత. అలాంటి నటే కంగన. ఏదో ఒక రోజున లీడర్‌ అవుతారు’’ అని విజయేంద్రప్రసాద్‌ చెప్పారు.

11

‘తలైవి’ ఏప్రిల్ 23న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రకాష్‌రాజ్‌, అరవిందస్వామి, జిషు సేన్‌గుప్తా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విబ్రి పతాకంపై విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.