Kannada Heroines: నువ్వా.. నేనా సై.. నార్త్ టూ సౌత్ కన్నడ భామల హవా!

ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ గా కన్నడ భామలు సత్తా చాటుతూనే ఉన్నారు. బుట్టబొమ్మ, క్రష్మిక, బేబమ్మ..

Kannada Heroines: నువ్వా.. నేనా సై.. నార్త్ టూ సౌత్ కన్నడ భామల హవా!

Kannada Heroines

Kannada Heroines: ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ గా కన్నడ భామలు సత్తా చాటుతూనే ఉన్నారు. బుట్టబొమ్మ, క్రష్మిక, బేబమ్మ.. ఇప్పుడు వీళ్లకి పోటీగా మరో భామ రంగంలోకి దిగింది. నేనొస్తున్నా కాచుకోండంటూ గట్టి బ్లాక్ బస్టర్ తో భయపెట్టిస్తోంది. టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు కూడా ఈమెకి ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

Kannada Heroins: సిల్వర్ స్క్రీన్‌పై కన్నడ భామల జోరు!

తెలుగు ఇండస్ట్రీని కన్నడ భామలు ఆల్ మోస్ట్ ఆక్యుపై చేసేసుకున్నారు. ఇక్కడ హిట్ హీరోయిన్ అనిపించుకున్నాక ముంబై చెక్కేస్తున్నారు. సైమల్టేనియస్ గా అక్కడో కాలు.. ఇక్కడో కాలు వేసి సౌత్ టు నార్త్ సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఏ సినిమాలో అయినా హీరోయిన్ ఎవరు అంటే..శాండల్ బ్యూటీ అనే చెప్తున్నారు. అంతగా ఈ మద్య హవా నడిపిస్తున్నారు ఈ కన్నడ భామలు.

Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..

అసలా ఆ గాలిలో, ఆ నీళ్లలో అంత మ్యాజిక్ ఉందని, అందుకే అందరికీ కర్ణాటక భామలు అంతలా నచ్చేస్తారని చెప్పే పూజాహెగ్డే ఇప్పటికీ మంచి ఫామ్ లోనే ఉంది. తెలుగులో బ్లాక్ బస్టర్స్ దక్కించుకొని పుష్పతో నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక. తెలుగులో క్రేజీ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఉప్పెనలా వచ్చి అదే రేంజ్ లో అవకాశాలు సాధిస్తుంది కృతి శెట్టి. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల లాంటి హీరోయిన్ డేట్స్ కూడా ఖాళీగా కనిపించట్లేవు. ఇప్పుడు వీళ్లకు పోటీగా కేజీఎఫ్ శ్రీనిథి శెట్టి టాలీవుడ్ లో సెటిలయ్యేలా సన్నాహాలు చేసుకుంటోంది.

KGF2: బాలీవుడ్ కా బాప్ రాఖీ భాయ్.. తొలిరోజు వసూళ్లతో విధ్వంసం..!

శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ ట్రెమండస్ సక్సెస్ తో బాగా పేరుతెచ్చుకుంది. చాప్టర్-1లో స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. చాప్టర్-2లో కనిపించినంత సేపు ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. రాయల్ లుక్ లో హుందాగా.. అంతే అందంగా., మొత్తంగా ఓ రాణిలా జనాలను అట్రాక్ట్ చేస్తోంది. 2015 మిస్ కర్ణాటక, 2016 మిస్ సుప్రా నేషనల్ ఇండియాగా నిలిచింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఆఫర్ తో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమ్ తో తమిళ్ మూవీ కోబ్రాలో నటించింది.

KGF2-Beast: భారీ బడ్జెట్.. గ్రాండ్ మేకింగ్.. ఇద్దరు బడా స్టార్స్ బాక్సాఫీస్ ఫైట్!

కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజయ్యేదాకా ఏ సినిమాకి సైన్ చేయకూడదని డిసైడైన శ్రీనిధి.. ఇప్పుడు ఆఫర్స్ కు ఎస్ చెప్తోంది. టాలీవుడ్ బిగ్ సినిమా ఆఫర్స్ శ్రీనిధి తలుపు తడతున్నట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీతో పాటూ తారక్ – కొరటాల శివ సినిమా కోసం శ్రీనిధిని మేకర్స్ సంప్రదించినట్టు టాక్. అదే జరిగితే ఇప్పటికే టాలీవుడ్ ను ఏలుతున్న పూజా, రష్మిక, కృతి వంటి కన్నడ కస్తూరిలకు పోటీగా మరో శాండిల్ వుడ్ బ్యూటీ పాగా వేసినట్టే.