Yogi Babu : మరో డివైన్ సబ్జెక్ట్‌తో రాబోతున్న కన్నడ మేకర్స్.. కాంతార నటుడితో యోగిబాబు ప్రధాన పాత్ర..

కాంతార లాంటి డివైన్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియా హిట్టుని అందుకోవడంతో కన్నడ మేకర్స్.. అటువంటి మరికొన్ని సబ్జెక్ట్స్ ని తీసుకు వచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ కన్నడ నిర్మాత మధుసూధన్‌రావు ఒక చిత్రాన్ని ప్రకటించాడు. కాంతార సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో తమిళ స్టార్ కమెడియన్ కూడా నటించబోతున్నాడు.

Yogi Babu : మరో డివైన్ సబ్జెక్ట్‌తో రాబోతున్న కన్నడ మేకర్స్.. కాంతార నటుడితో యోగిబాబు ప్రధాన పాత్ర..

yogi babu pramod shetty

Yogi Babu : కాంతార లాంటి డివైన్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియా హిట్టుని అందుకోవడంతో కన్నడ మేకర్స్.. అటువంటి మరికొన్ని సబ్జెక్ట్స్ ని తీసుకు వచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే.. ప్రముఖ కన్నడ నిర్మాత మధుసూధన్‌రావు ఒక చిత్రాన్ని ప్రకటించాడు. కాంతార సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో తమిళ స్టార్ కమెడియన్ కూడా నటించబోతున్నాడు.

Vijay Antony : మలేషియా చేరుకున్న విజయ్ ఆంటోనీ కుటుంబ సభ్యులు.. పరిస్థితి విషమం?

తమిళ సినిమాల్లో హీరోలతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకున్న యోగి బాబు ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా కథ కేరళ శబరిమల నేపథ్యంతో తెరకెక్కబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీ మొదటి షూటింగ్ షాట్ ని మకర సంక్రాంతి నాడు శబరిమలలో చిత్రీకరించారు. ‘సన్నిధాన పీఓ’ అనే డిఫరెంట్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్.

డివైన్ లవ్ స్టోరీ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాకి మలయాళ దర్శకుడు రాజీవ్ వైద్య రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమా గురించి నిర్మాత మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ఈ సినిమా కథ పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించే వివిధ మతాల వ్యక్తుల మధ్య మతపరమైన ప్రవేశం ఎలా విబేధించబడింది అనే అంశాన్ని హైలైట్ చేసేలా ఉంటుంది అని తెలియజేశాడు.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను శబరిమల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు, ప్రమోద్ శెట్టి లతో పాటు సౌత్ ఇండియన్ సినిమాలోని స్టార్ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తారని తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివరాలను త్వ‌ర‌లోనే ప్రకటిస్తాము అంటూ చిత్రబృందం ప్రకటించింది.