Ram Charan : రామ్‌చరణ్ నటనకి ఫ్యాన్ అయ్యాను.. శివరాజ్ కుమార్!

RRR మూవీలో చరణ్ యాక్టింగ్ దేశీ నుంచి విదేశీ వరకు అందరూ ఫిదా అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం రామ్ చరణ్ నటనకి ఫ్యాన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ మెగాస్టార్ శివరాజ్ కుమార్ 'RRR' చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ..

Ram Charan : రామ్‌చరణ్ నటనకి ఫ్యాన్ అయ్యాను.. శివరాజ్ కుమార్!

charan shivaraj kumar

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చాడని, తనకి అసలు నటన రాదని ఎన్నో విమర్శలు ఎదురుకున్నాడు. టాలీవుడ్ లోనే కాదు జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాక, అక్కడ కూడా తీవ్ర విమర్శలు ఫేస్ చేశాడు. కానీ చరణ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ధృవ సినిమాతో తన యాక్టింగ్ ఎబిలిటీస్ ఏంటో ఒక శాంపిల్ చూపించిన రామ్ చరణ్.. రంగస్థలం మూవీతో తన నటనా విశ్వరూపం చూపించేశాడు.

Ram Charan : ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకోము.. వాల్తేరు వీరయ్య స్టేజిపై రామ్ చరణ్ వార్నింగ్..

ఇక RRR సినిమాతో అయితే తనని విమర్శించిన వాళ్లతోనే తన నటనని పొగిడేలా చేసుకున్నాడు. ఈ మూవీలో చరణ్ యాక్టింగ్ దేశీ నుంచి విదేశీ వరకు అందరూ ఫిదా అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం రామ్ చరణ్ నటనకి ఫ్యాన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ‘RRR’ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. “ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా మెచ్యూర్ గా ఉంటుంది. మనం డైలాగ్స్ చెప్పి, గట్టిగా అరిసిన దానికంటే.. సెటిల్ గా చేసిన యాక్టింగ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మూవీలో చరణ్ అలా సెటిల్ గా చేశాడు. RRR చూశాక నేను రామ్ చరణ్ నటనకి పెద్ద ఫ్యాన్ అయిపోయా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా రామ్ చరణ్ ప్రెజెంట్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ఒక సాంగ్ షెడ్యూల్ లు మొదలు పెట్టనుంది అని సమాచారం. ఈ సాంగ్ ని చరణ్, కియారా అద్వానీతో పాటు దాదాపు 500 పైగా డాన్సర్స్ పై చిత్రీకరించనున్నారట. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చ్ 27న చరణ్ బర్త్ డే కావడంతో మూవీ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు అని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఏమన్నా గుడ్ న్యూస్ చెపుతుందా? లేదా? చూడాలి.

View this post on Instagram

A post shared by @i_am_a_charanfangirl