Kabjaa Movie Review : ఇది కబ్జ కాదు ఉపేంద్ర KGF.. మామూలు రివెంజ్ కథకు KGF కథనం..

భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా కబ్జ నేడు మార్చ్ 17న రిలీజయింది. టీజర్స్, ట్రైలర్స్ చూసి ఇది KGF లా ఉండబోతుంది అని అంచనాలు పెట్టుకున్నారు. కబ్జ కథ విషయానికి వస్తే..............

Kabjaa Movie Review :  కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా, శ్రియ హీరోయిన్ గా చంద్రు దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సినిమా కబ్జ. మరో ఇద్దరు కన్నడ స్టార్లు సుదీప్, శివరాజ్ కుమార్ లు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా కబ్జ నేడు మార్చ్ 17న రిలీజయింది. టీజర్స్, ట్రైలర్స్ చూసి ఇది KGF లా ఉండబోతుంది అని అంచనాలు పెట్టుకున్నారు.

కబ్జ కథ విషయానికి వస్తే.. స్వతంత్రం ముందు ఓ స్వతంత్ర పోరాట యోధుడిని బ్రిటిష్ వాళ్ళు చంపేసి, అతడి రాజ్యాన్ని నాశనం చేయడంతో భార్య, పిల్లలు అనాథలవుతారు. బతకడానికి మరో రాజ్యానికి వెళ్తారు. ఆ పిల్లల్లో ఒకరు హీరో ఉపేంద్ర. స్వతంత్రం వచ్చాక ఉపేంద్ర ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుదాం అనుకునే సమయంలో తన అన్న మాఫియా వాళ్ళు చేసిన పనికి ఎదురు నిలబడి ఓ మాఫియా లీడర్ కొడుకుని చంపేస్తాడు. దీంతో ఉపేంద్ర అన్నని ఆ మాఫియా వాళ్ళు చంపేస్తారు. వాళ్ళ అన్నని చంపేశారని కోపంతో ఉపేంద్ర వాళ్ళని చంపుకుంటూ వెళ్తాడు. అలా అతనికి తెలియకుండానే అతన్ని కాపాడుకోవడానికి వేరే వాళ్ళని చంపుకుంటూ వెళ్లి పెద్ద మాఫియా లీడర్ గా మారుతాడు. మరో పక్క చిన్నప్పట్నుంచి ఓ రాకుమారి(శ్రియ)తో ప్రేమలో పడి ఆ రాజసంస్థానం వాళ్ళు వద్దన్నా రాకుమారి హీరోని పెళ్లి చేసుకుంటుంది. చాలా సింపుల్, మాములు రివెంజ్ కథ.

అయితే కథనం మాత్రం చాలా ఎలివేషన్స్ తో అచ్చం KGF లానే తీశారు. KGF సినిమాలు వాడిన లొకేషన్స్, అవే కెమెరా ఫ్రేమ్స్, అదే వాయిస్ ఓవర్ నేరేషన్, కొన్నిచోట్ల అదే KGF మ్యూజిక్, అదే గన్స్, ఫైట్స్.. ఇలా సినిమా మొత్తం కూడా అచ్చం KGF లానే అనిపిస్తుంది. KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం గమనార్హం. కథ వేరు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకోసారి మళ్ళీ KGF సినిమా చూసినట్టు అయ్యేది. చివర్లో ఉపేంద్ర వర్సెస్ సుదీప్ ఉండగా మధ్యలో శివరాజ్ కుమార్ వస్తాడు. దీంతో కబ్జ2 అని అనౌన్స్ చేసి సినిమాని అర్దాంతరంగా ముగించేశారు.

RRR : కాలభైరవ పై ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. సారీ చెప్పిన కాలభైరవ!

సినిమా టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నా, సినిమా మాములు రివెంజ్ కథ కావడం, KGF లానే టేకింగ్ ఉండటంతో జనాలు పెద్దగా అట్రాక్ట్ కాలేకపోయారు. KGF హిట్ అయిందని ఇటీవల దాన్ని ఆధారంగా తీసుకొని సినిమాలు తీస్తున్నారు. కానీ అవి హిట్ అవ్వట్లేదు. ఇప్పుడు కబ్జ కూడా కన్నడలో హిట్ అయినా వేరే రాష్ట్రాల్లో మాత్రం అనుమానమే. భారీగా రిలీజ్ చేసిన ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు