South Star Hero’s: సై అంటే సై.. తగ్గేదేలే అంటోన్న కన్నడ, తమిళ్ స్టార్స్

ఒక్క తెలుగు సినిమాలే కాదు.. కన్నడ, తమిళ్ మూవీస్ కూడా హిందీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. బడ్జెట్ తో సంబంధం లేదు.. హీరోతో సంబంధం లేదు.. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్..

South Star Hero’s: సై అంటే సై.. తగ్గేదేలే అంటోన్న కన్నడ, తమిళ్ స్టార్స్

South Star Hero's

South Star Hero’s: ఒక్క తెలుగు సినిమాలే కాదు.. కన్నడ, తమిళ్ మూవీస్ కూడా హిందీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. బడ్జెట్ తో సంబంధం లేదు.. హీరోతో సంబంధం లేదు.. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వచ్చినా ఆదరించే పరిస్థితి ఉంది బాలివుడ్ లో. అందుకే ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవడం లేదు మన హీరోలు.

Pan India Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్‌పై టాలీవుడ్ దండయాత్ర!

తెలుగు సినిమాలకు బాలివుడ్ లో వస్తోన్న రెస్పాన్స్ చూశాక.. కోలివుడ్, శాండల్ వుడ్ అటు మాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా పాన్ ఇండియా మూవీస్ ని పట్టాలెక్కించారు. మూడేళ్ల కిందట యశ్ హీరోగా వచ్చిన కేజీఎప్ చాప్టర్ వన్ ఐతె.. బాలివుడ్ లో ఓ రేంజ్ లో రచ్చ చేసింది. ఒక్క దెబ్బతో హిందీ ఆడియన్స్ హీరో యశ్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే ఇప్పుడు కేజీఎప్ చాప్టర్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు నార్త్ లో ఏ కన్నడ సినిమా క్రియేట్ చేయనన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేసింది కేజీఎఫ్.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

తమిళ స్టార్ హీరో ధనుష్ అడపా దడపా బాలివుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లో నటిస్తూ.. హిందీ ఆడియన్స్ కి బాగా దెగ్గరయ్యాడు. లేటెస్ట్ గా రిలీజైన ఆత్రంగి రే మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ధనుష్ హీరోగా బాలివుడ్ లో వచ్చిన రాన్ జానా మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హిందీ ఆడియన్స్ లో ఉన్న ఫేమ్ చూస్తుంటె.. ఫ్యూచర్లో ధనుష్ కూడా పాన్ ఇండియా మూవీస్ తో బాలివుడ్ లో రచ్చ చేశే ఛాన్స్ ఉంది.

Deepika Padukone: అందాల ద‌డ పుట్టిస్తున్న దీపిక ప‌దుకొణె!

ఇక కోలివుడ్ లో మణిరత్నం డైరెక్షన్ లో.. ‘పొన్నియన్ సెల్వన్’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. విక్రమ్, ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్స్ లో రాబోతున్న ఈ మూవీని బాహుబలి రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ టార్గెట్ కూడా బాలివుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడమే అని ప్రచారం జరుగుతోంది.

Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

కమల్ హాసన్ హీరోగా.. భారతీయుడు మూవీకి సీక్వెల్ గా రాబోతున్న ఇండియన్ 2 కూడా బాలివుడ్ లో దుమ్మురేపనుంది. కోలివుడ్ స్టార్ హీరో సూర్య ‘ఈటీ’ మూవీతో హిందీ ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. సూర్య పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈటీపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

కేవలం డైరెక్ట్ మూవీసే కాదు.. హిందీలోకి డబ్బింగ్ ఐన సౌత్ మూవీస్ కూడా రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ్ హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కోట్లలో వ్యూవర్ షిప్ దక్కుతోంది. తెలుగు సినిమాల్ని రీమేక్ చేస్తోన్న బాలివుడ్ ప్రొడ్యూసర్స్.. డబ్బింగ్ సినిమాల్ని యూట్యూబ్ లో పెట్టకుండా బేరాలాడాల్సిన సిచ్చుయేషన్ ఉంది. మొత్తానికి బాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హవా రోజురోజుకి పెరుగుతోంది. సౌత్ సినిమాలకు హిందీ ఆడియన్స్ లో అభిమానం రెట్టింపు అవుతోంది.